Viral Video: ఈ పాముకు అందంతో పాటు.. సిగ్గు కూడా ఎక్కువేనట..!
పాములు చాలా రకాలు ఉంటాయి. వాటిలో విష పూరితమైనవి ఉంటాయి.. మరికొన్ని హాని చేయనివి కూడా ఉంటాయి.
పాములు చాలా రకాలు ఉంటాయి. వాటిలో విష పూరితమైనవి ఉంటాయి.. మరికొన్ని హాని చేయనివి కూడా ఉంటాయి. భూమిపై కొన్ని ప్రదేశాలు మినహా ప్రతిచోటా విష సర్పాలు కనిపిస్తాయి. ప్రపంచంలో దాదాపు 725 రకాల విషపూరిత పాములు ఉన్నప్పటికీ, వీటిలో కొన్ని జాతులు మాత్రమే మానవులపై ఎక్కువగా దాడి చేస్తాయి. పాము కాటు కారణంగా ప్రతి యేట..వేలాది మంది మరణిస్తున్నారు. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మీకు ఓ అరుదైన పామును చూపించబోతున్నాం. ఈ పాము చూసేందుకు ఎంతో పొడవుగా, అందంగా కనిపిస్తోంది. దాని శరీరంపై నల్లటి చారలు కలిగి..లేత పసుపు చారలతో చూపరులను ఆకర్షిస్తోంది. రాళ్లు, ఎండిపోయిన చెట్ల పొదలలాంటి ప్రాంతం నుంచి ఈ భారీ విషసర్పం బయటకు వచ్చి వేగంగా కదులుతోంది. దాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే, IFS అధికారి పర్వీన్ కస్వాన్ ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆయన ఈ వీడియోతో పాటు పాము ఎంతటి ప్రమాదకారి అన్న విషయం కూడా చెప్పారు. ఈ పామును బ్యాండెడ్ క్రైట్‌గా పిలుస్తారని చెప్పారు. ఇది అత్యంత విషపూరితమైనదిగా తెలిపారు. కానీ, దీనికి సిగ్గుపడే స్వభావం ఉంటుందని చెప్పారు. ఈ పాము మరో ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుందట. ఏదైనా శబ్దం వచ్చిన వెంటనే నోరు దాచుకుంటుందని చెప్పారు. కానీ, ఈ పాము కాటు..ఫలితం భయంకరమైనదని వివరించారు. సరైన సమయంలో చికిత్స అందితే..బతికే ఛాన్స్ ఉంది..కానీ, అది కాటు వేసిన భాగంలో మాత్రం.. జీవితాంతం అక్కడ గాయం అలాగే ఉంటుందట. ఈ పాము మనుషులు సంచరించే ప్రాంతాలకు దూరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. వీడియో చూసిన నెటిజన్లు సైతం పాముపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. అందంగా ఉందని కొందరు చెబుతుంటే.. అందం హానికరం అంటూ సరదాగా మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
This beauty. Guess what it is !! pic.twitter.com/62QVJ2w3gR
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 16, 2021
Also Read: Oo Antava..Oo Oo Antava: పేరడీనా..? కౌంటరా..?.. వైరలవుతోన్న మేల్ వెర్షన్