AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oo Antava..Oo Oo Antava: పేరడీనా..? కౌంటరా..?.. వైరలవుతోన్న మేల్ వెర్షన్

పుష్ప సినిమాలో 'ఊ అంటావా ఊహూ అంటావా' సాంగ్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పాటపై వివాదాలు కూడా అంతేస్థాయిలో ముసురుపుతున్నాయి.

Oo Antava..Oo Oo Antava: పేరడీనా..? కౌంటరా..?.. వైరలవుతోన్న మేల్ వెర్షన్
Samantha Pardy Song
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 18, 2021 | 4:47 PM

Share

పుష్ప సినిమాలో ‘ఊ అంటావా ఊహూ అంటావా’ సాంగ్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పాటపై వివాదాలు కూడా అంతేస్థాయిలో ముసురుపుతున్నాయి. మగవాళ్ల మైండ్‌సెట్ గురించి తప్పుగా ప్రజెంట్ చేశారని.. ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది వ్యవహారం.  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటకు పేరడీలు కూడా వచ్చేశాయి. పేరడీ అని చెబుతున్నారు కానీ.. లిరిక్స్ వింటే మాత్రం కౌంటర్‌లా ఉంది. పేరడీ పాటలో లిరిక్స్ ఏంటి.. పుష్ప సినిమా పాటకీ.. ఈ పాటకీ పోలిక ఏంటో తెలుసుకుందాం పదండి.

కోక కట్టినా.. గౌను వేసినా వంకరగా చూస్తారని పుప్ప సినిమాలో సాంగ్‌లో రాస్తే.. పొట్టి బట్టలు వేసి టెంప్ట్ చేస్తారంటూ పేరడీ సాంగ్‌లో రాసుకొచ్చారు. 

రంగుతో పని లేకుండా అందరినీ వంకరగా చూస్తారని అక్కడ అంటే.. అబ్బాయి అందాన్ని కాకుండా డబ్బును చూసి ఊ.. అంటారనేది కౌంటర్ లిరిక్.

బొద్దు, సన్నం కాదు.. ఒంటిగ ఉంటే.. నలిపేస్తారని అక్కడ అంటే.. షాపింగ్, సినిమా షికార్ల పేరుతో ఊడ్చేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.

పెద్ద మనిషిలాగే ఉంటారు.. చీకటి పడితే.. తప్పుడు ఆలోచనలే అని అక్కడ అంటే.. సమయం వచ్చినప్పుడు అందరూ వంకరగా చూస్తారంటూ ఇక్కడ కౌంటర్ పడింది.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో ఊ అంటావా.. ఊహూ అంటావా మామా సాంగ్ అభిమానులను ఎంత ఊపేస్తోంది. కాంట్రవర్సీలు కూడా అంతే చుట్టుముడుతున్నాయి. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సాంగ్.. పెద్ద సెన్సేషన్‌గా మారింది. అందులో లిరిక్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి.  ఒరిజినల్ సాంగ్ దిగువన చూడండి

ఇదిలా ఉంటే.. ఈ లిరిక్స్‌కు పూర్తి ఆపోజిట్‌లో.. ఉన్న లిరిక్స్‌తో వచ్చిన ఓ పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప సినిమాలోని లిరిక్స్‌కు కౌంటర్‌గా ఈ పాటని రాశారా అనేతంలా ఉన్నాయి. అవేంటో ఓసారి వినండి.

అయితే ఈ సాంగ్ కేవలం సరదా కోసమే చేశామని.. ఎవరైనా హర్ట్ అయితే క్షమించాలని పాట లిరిసిస్ట్, సింగర్ టీవీ9 వేదికగా కోరారు.

Also Read: Akhanda: ‘అఖండ’ విజయం.. కళ్లు చెదిరేలా 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్