Akhanda: ‘అఖండ’ విజయం.. కళ్లు చెదిరేలా 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

'అఖండ' రూపంలో బాలయ్య సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. తన కెరీర్‌లోనే తొలిసారి 100 కోట్ల గ్రాస్‌ను టచ్ చేశారు.

Akhanda: 'అఖండ' విజయం.. కళ్లు చెదిరేలా 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
Akhanda
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 17, 2021 | 4:08 PM

‘అఖండ’ రూపంలో బాలయ్య సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. తన కెరీర్‌లోనే తొలిసారి 100 కోట్ల గ్రాస్‌ను టచ్ చేశారు. బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్, బాలయ్య సింహ గర్జనకు బాక్సాఫీసులు బద్దలయ్యాయి. అన్నీ చోట్లా బ్రేక్ ఈవెన్‌ దాటేసింది అఖండ. ఓవర్సీస్‌లో సైతం ఊహించని వసూళ్లను దక్కించుకుంది. రిలీజైన 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి.. ఆశ్చర్యపరిచింది. తొలివారంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘అఖండ’ .. రెండో వారంలో ఫరవాలేదనిపించి.. మూడో వారంలోకి ఎంటర్ అయింది. గురువారంతో 15 రోజుల రన్ పూర్తి చేసుకొని 10 కోట్లకు పైగా లాభాలతో ముందుకు వెళ్తోంది. 14వ రోజుతో పోల్చితే 15వ రోజు కలెక్షన్స్ 25% వరకు డ్రాప్ అయ్యాయన్నది ట్రేడ్ నిపుణుల రిపోర్ట్. 14వ రోజు 45 లక్షలు షేర్ వసూలు కాగా.. 15వ రోజుకు గాను తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘అఖండ’ కు 30 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయట. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికి 64 కోట్ల నెట్ కటెక్షన్స్ రాబట్టింది.  అంటే 10 కోట్లకు పైనే ప్రాఫిట్ అందుకుంది. సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో మూవీ యూనిట్ పుణ్యక్షేత్రాలకు వెళ్లి.. దైవ దర్శనం చేసుకుంటుంది. ఇప్పటికే బెజవాడ దుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి, తిరుమల వెంకన్నల దర్శనం చేసుకున్నారు.

ఇక అఖండ ఇచ్చిన బూస్ట్‌తో మిగిలిన చిత్రాలు కూడా మంచి జోష్‌లో రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ పాజిటివ్ టాక్‌తో ముందుకు వెళ్తుంది.

Also Read: Tragedy: కూలిన స్కూల్ గోడ.. చితికిన విద్యార్థుల బ్రతుకులు.. ముగ్గురు దుర్మరణం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో