Viral News: రెండు వారాల తర్వాత కోమా నుంచి తిరిగొచ్చిన యువతి.. ఆమె మాటలు విని డాక్టర్లు షాక్.!
ఎవరూ ఊహించనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది కోమాలోకి వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కోమా నుంచి తిరిగి...
ఎవరూ ఊహించనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది కోమాలోకి వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కోమా నుంచి తిరిగి స్పృహలోకి రావడం.. పలు థెరపీ సెషన్స్ తర్వాత మళ్లీ మాములు స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఇలాంటి వార్తలు తరచూ మనం వింటూనే ఉంటాం. ఇదిలా ఉంటే.. సాధారణంగా కోమాలోకి వెళ్లిన వ్యక్తులు గతాన్ని మర్చిపోవడం గానీ.. అప్పటివరకూ లేని అనారోగ్య సమస్యలతో గానీ బాధపడుతుంటారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ఓ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో నివాసముంటున్న సమర్ డియాజ్ (24) గతేడాది నవంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. దాదాపు రెండు వారాల నిరీక్షణ అనంతరం ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. ఇక స్పృహలోకి వచ్చిన సమర్ వేరే భాషను మాట్లాడుంటే.. డాక్టర్లకు డౌట్ వచ్చి.. ”మీరు ఏ దేశానికి చెందిన పౌరులని ” ఆమెను అడిగారు. తాను అమెరికాలోని కాలిఫోర్నియా నివాసినని సమర్ చెప్పడంతో వైద్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
కాగా, కోమా నుంచి తిరిగొచ్చిన సమర్ తన మాతృభాషను మర్చిపోయి న్యూజిలాండ్ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. దీనితో డాక్టర్లు, అక్కడ పని చేసే వైద్య సిబ్బందితో పాటు సమర్ సన్నిహితులు కూడా షాక్ అయ్యారు. అయితే డాక్టర్లు మాత్రం ఖంగారు పడాల్సిన అవసరం లేదని.. సమర్ ‘ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్’ అనే డీసీజ్‌తో బాధపడుతోందని వివరించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??