King Cobra: ఇంట్లోకి చొరబడిన 12 అడుగుల కింగ్ కోబ్రా.. చాకచక్యంగా పట్టేసుకున్న స్నేక్ క్యాచర్
Uttarakhand: గత కొన్ని రోజులుగా అడవుల్లో ఉండాల్సిన మూగజీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. క్రూర జంతువులతో పాటు పాములు, కొండచిలువలు వంటి సర్పాలు గ్రామాలు, ఇళ్లల్లోకి చొరబడి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Uttarakhand: గత కొన్ని రోజులుగా అడవుల్లో ఉండాల్సిన మూగజీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. క్రూర జంతువులతో పాటు పాములు, కొండచిలువలు వంటి సర్పాలు గ్రామాలు, ఇళ్లల్లోకి చొరబడి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ కోట్ద్వార్లోని హరేంద్రనగర్ ప్రాంతంలో కింగ్ కోబ్రా తీవ్ర కలకలం రేపింది. సుమారు12 అడుగులకుపైగా పొడవున్న ఈ సర్పాన్ని చూసి జనం వణికిపోయారు. సమీప అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి వచ్చిన కోబ్రా.. అనిల్ రాటూరి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. అతనితో పాటు స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందంచారు. అలాగే స్థానికంగా పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న జీతూ అనే స్నేక్ క్యాచర్‌ను కూడా పిలిపించారు.
సమాచారం అందుకున్న వెంటనే అనిల్ ఇంటికి చేరుకున్న జీతూ తీవ్రంగా శ్రమించి చాకచక్యంతో కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం దానిని తీసుకెళ్లి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశాడు. కాగా ఈ కింగ్ కోబ్రా వయసు 6నుంచి 7 ఏళ్లు ఉంటుందని చెప్పుకొచ్చాడు జీతూ. అలాగే 11 నుంచి 12 అడుగుల పొడవు ఉంటుందన్నాడు. కాగా పాములు పట్టడంలో ఎంతో నేర్పరి అయిన జీతూ ఈ ఏడాదిలోనే సుమారు 250కు పైగా పాములను పట్టుకున్నాడట. వాటికి ఏ హాని కలగకుండా చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలేస్తున్నానంటున్నాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..