AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 దేశాలు తిరిగిన 111 ఏళ్ల నౌక‌.. ఇప్పుడు భూమీపై ఇలా వెల్కమ్‌ చెబుతోంది..!

సముద్రంలో ఒక శతాబ్దానికి పైగా గడిచిన తర్వాత ఆ నౌక ఇండోనేషియాలోని బింటాన్ అనే ఉష్ణమండల ద్వీపంలో భూమిపైకి వచ్చింది. 15 ఏళ్ల కిందట ఇండోనేసియాలోని బింటాన్‌ భూభాగంపై ఎస్ఎస్ మెడీనా సేవ‌ల నుంచి త‌ప్పుకుంది. దీన్ని సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఎరిక్‌ సా కొనుగోలు చేసి, రూ.153 కోట్లతో విలాసవంతమైన హోట‌ల్‌గా మార్చారు.

100 దేశాలు తిరిగిన 111 ఏళ్ల నౌక‌.. ఇప్పుడు భూమీపై ఇలా వెల్కమ్‌ చెబుతోంది..!
Luxury Hotel Ss Medina's
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2025 | 3:56 PM

Share

అమెరికాకు చెందిన‌ ఎస్ఎస్ మెడీనా అనే 111 ఏళ్ల నౌక‌ను హోట‌ల్‌గా మార్చారు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఈ నౌక సేవ‌లందించింది. 3,60,000 నాటిక‌ల్ మైళ్లు ప్ర‌యాణించిన ఈ నౌక 100 దేశాల‌ను చుట్టింది. సముద్రంలో ఒక శతాబ్దానికి పైగా గడిచిన తర్వాత ఆ నౌక ఇండోనేషియాలోని బింటాన్ అనే ఉష్ణమండల ద్వీపంలో భూమిపైకి వచ్చింది. 15 ఏళ్ల కిందట ఇండోనేసియాలోని బింటాన్‌ భూభాగంపై ఎస్ఎస్ మెడీనా సేవ‌ల నుంచి త‌ప్పుకుంది. దీన్ని సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఎరిక్‌ సా కొనుగోలు చేసి, రూ.153 కోట్లతో విలాసవంతమైన హోట‌ల్‌గా మార్చారు.

ఈ ఓడను ఇప్పుడు ఒక ఇంద్ర భవనంగా చెప్పవచ్చు అంటున్నారు దాని యజమాని ఎరిక్‌సా. ఇక్కడి జీవితం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని సా పేర్కొన్నాడు. కొంతమంది అతిథులు ముఖ్యంగా పోర్త్‌హోల్స్ నుండి బయటకు చూసి అలలను చూసినప్పుడు కొంచెం సముద్రపు అలల అనుభూతి చెందుతారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..