AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆన్‌లైన్‌లో ఇష్టంగా దహీపూరి ఆర్డర్ పెట్టింది.. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూడగా

ఆమెకు దహీపూరి చాట్ అంటే ఇష్టం. సరే.! బయటకు వెళ్లి తినేందుకు ఊపిక లేక.. ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టింది. కాసేపటికి ఆ పార్శిల్ ఇంటికొచ్చింది. తీరా ఆవురావురుమని అది ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యింది సదరు యువతి.

Viral: ఆన్‌లైన్‌లో ఇష్టంగా దహీపూరి ఆర్డర్ పెట్టింది.. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూడగా
Viral
Ravi Kiran
|

Updated on: Dec 20, 2024 | 9:08 PM

Share

పండ్ల నుంచి కూరగాయల వరకు.. బట్టల నుంచి ఫుడ్ పార్శిళ్ల వరకు అన్ని ఇంటి నుంచే ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఓ యువతి ఉత్సాహంగా ఓ ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లో దహీపూరి చాట్ ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు దహీపూరికి బదులుగా ఇంటికొచ్చిన పార్శిల్ చూసి దెబ్బకు షాక్ అయింది. దీంతో విసుగు చెందిన సదరు యువతి.. బెంగుళూరు వదిలి వెళ్లడానికి 101 కారణాల్లో ఇది కూడా ఒకటని సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

దహీపూరి చాట్ చాలామందికి ఇష్టమైన ఈవెనింగ్ స్నాక్. అందుకే చాలామంది తరచుగా రోడ్డు పక్కన దహీపూరి తింటుంటారు. అదే విధంగా బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ నార్త్ ఇండియన్ యువతి కూడా దహీపూరి తినాలనుకుంది. దానికి తగ్గట్టుగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా.. దహీపూరికి బదులుగా.. మాములు పూరి పార్శిల్, పెరుగు గిన్నె వచ్చాయి. ఇది చూసి ఆమె బిత్తరపోయింది. తన అసంతృప్తిని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసి.. “బెంగుళూరును విడిచిపెట్టడానికి 101 కారణాలు.. అందులో ఇది ఒకటి” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఇక ఆ పోస్ట్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇది చదవండి: అయ్‌బాబోయ్‌.. ఎంత పే..ద్ద వింత ఆకారం.. చూస్తే గుండెల్లో గుబులు

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో