Viral: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కాన్ చేసి చూడగా డాక్టర్ల మైండ్ బ్లాంక్!

కడుపు నొప్పి తగ్గకపోగా.. విపరీతంగా పెరిగిపోవడంతో ఇక చేసేదేమీ లేక చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు ఆమె స్కాన్ చేసి.. రిపోర్ట్స్ చూడగా..

Viral: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కాన్ చేసి చూడగా డాక్టర్ల మైండ్ బ్లాంక్!
Viral News
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2022 | 12:11 PM

గత కొంతకాలంగా ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతోంది. మొదట్లో ఆమె ఆ నొప్పిని పెద్దగా పట్టించుకోలేదు. ఇంట్లోనే వైద్యం చేయించుకునేది. దాని వల్ల కడుపు నొప్పి తగ్గకపోగా.. విపరీతంగా పెరిగిపోవడంతో ఇక చేసేదేమీ లేక చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు ఆమెకు స్కాన్ చేసి.. రిపోర్ట్స్ చూడగా.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హీరా షేక్ అనే మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆమె మొదట్లో ఆ నొప్పిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అది క్రమేపీ పెరుగుతూ తీవ్రమైన నొప్పిగా మారడంతో స్థానిక సబ్ డివిజినల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లింది. డాక్టర్లు సదరు మహిళకు స్కానింగ్ చేయగా.. రిపోర్ట్స్‌లో ప్లాస్టిక్, వ్యర్ధాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమె కడుపులో నుంచి 100 గ్రాముల ప్లాస్టిక్, వ్యర్ధాలను ఆపరేషన్ ద్వారా తొలగించారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్సకు ‘హార్ట్ మ్యాన్ ఆపరేషన్’గా డాక్టర్లు నామకరణం చేయగా.. ప్రస్తుతం హీరా షేక్ ఆరోగ్యం బాగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్లే ఈ వ్యర్ధాలు కడుపులో ఏర్పడ్డాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..