Zomato Boy: అనుమానస్పదంగా జొమాటో డెలివరీ బాయ్.. డౌటు వచ్చి బ్యాగ్ చెక్ చేయగా షాకైన పోలీసులు!
లోక్ సభ ఎన్నికల కారణంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న లక్షల రూపాయల సొమ్మును పట్టుకున్నారు. ఇటీవల తనిఖీల్లో జొమాటో బాయ్ వద్ద భారీగా నగదును గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల కారణంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న లక్షల రూపాయల సొమ్మును పట్టుకున్నారు. ఇటీవల తనిఖీల్లో జొమాటో బాయ్ వద్ద భారీగా నగదును గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ అమృత వైన్స్ సమీపంలో సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు జొమాటో డెలివరీ బాయ్ గుబాల నాగార్జున (30) అని తెలుసుకొని పోలీసులు షాకయ్యారు. అతని రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలోని కడపకు చెందిన నాగార్జున బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో నివాసం ఉంటున్నాడు. జొమాటో కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే అతనికి అంతకుముందే మస్తాన్ వలీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి కువైట్ లో పరిచేయం ఏర్పడింది. 2024 ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగి వచ్చిన నాగార్జున హైదరాబాద్లోని జొమాటో కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు
మస్తాన్ వలీ తన మొబైల్ ఫోన్ లో నాగార్జునకు ఫోన్ చేసి మంగళ్ హాట్ లోని ప్లైవుడ్ స్టోర్ నుంచి కొంత నగదు తీసుకురావాలని, మంచి కమీషన్ ఇస్తానని చెప్పాడు. మస్తాన్ ఆదేశాల మేరకు నాగార్జున బాలాజీ ప్లైవుడ్ షాపుకు వెళ్లి రూ.14 లక్షల నగదును తీసుకున్నాడు. నాగార్జున తిరిగి వచ్చి అమృత వైన్ షాప్, మల్లపల్లి సర్కిల్, ఆసిఫ్ నగర్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. భారీగా నగదు తరలిస్తున్న నూర్ మహ్మద్, ఫైజల్ మాలిక్ అనే ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నూర్ మహ్మద్, ఫైజల్ మాలిక్ సికింద్రాబాద్ సీటీసీలో కంప్యూటర్ స్క్రాప్ బిజినెస్, ఎల్ఈడీ టీవీ బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవేకాకుండా పలు కేసుల్లో పోలీసులు భారీగా అక్రమ డబ్బును సీజ్ చేశారు.