AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వైఎస్.షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. గురువారం నుంచి పాదయాత్ర ప్రారంభానికి ఏర్పాట్లు

పోలీసుల విధులకు ఆంటంకం కలిగించడంతో పాటు.. ప్రగతి భవన్ సమీపంలో న్యూసెన్స్ క్రియేట్ చేశారన్న అభియోగాలతో అరెస్ట్ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నర్సంపేటలో..

Telangana: వైఎస్.షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. గురువారం నుంచి పాదయాత్ర ప్రారంభానికి  ఏర్పాట్లు
Ys Sharmila
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 29, 2022 | 11:21 PM

పోలీసుల విధులకు ఆంటంకం కలిగించడంతో పాటు.. ప్రగతి భవన్ సమీపంలో న్యూసెన్స్ క్రియేట్ చేశారన్న అభియోగాలతో అరెస్ట్ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నర్సంపేటలో పాదయాత్రలో తనను అడ్డుకుని దాడికి యత్నించిన టీఆర్ఎస్ శ్రేణుల వైఖరిని నిరసిస్తూ… దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతి భవన్ కు వెళ్లేందుకు యత్నించిన వైఎస్.షర్మిలను హైదరాబాద్ పోలీసులు మంగళవారం మద్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించగా.. ఆమె కారులో కూర్చుని ఉండగానే… క్రేన్ సాయంతో కారును ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆపై పంజాగుట్ట పీఎస్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం వరకు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లోనే షర్మిలను ఉంచిన పోలీసులు… వైద్యులను పోలీస్ స్టేషన్ కే రప్పించి… షర్మిలకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని షర్మిలను రిమాండ్ కు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. అయితే షర్మిల ఏమీ తప్పు చేయలేదని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రగతి భవన్ కు వెళుతుంటే…పోలీసులు అకారణంగా ఆమెను అరెస్ట్ చేశారని షర్మిల తరఫు న్యాయవాదులు వాదించారు. పోలీసులు నమోదు చేసిన కేసులకు, చెబుతున్న కారణాలకు అసలు పొంతనే లేదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. షర్మిలతో పాటు అరెస్టు చేసిన మరో ఐదుగురికి కూడా బెయిల్‌ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.

షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని పోలీసుల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. షర్మిల అసభ్య పదజాలం వినియోగిస్తున్న సమయంలో వీడియో తీసేందుకు యత్నించిన పోలీసు అధికారి నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపించారు. ఈ చర్య ద్వారా షర్మిల పోలీసు అధికారి విధులను అడ్డుకున్నట్టేనని కూడా తెలిపారు. షర్మిల, ఆమె అనుచరులు ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో హల్ చల్ చేశారని, శాంతి భద్రతలను పరిరక్షించేందుకే ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. షర్మిలను రిమాండ్ కు తరలించకుంటే నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కూడా పోలీసులు తెలిపారు. అయితే కోర్టు మాత్రం షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ మంజూరు కావడంతో పాటు.. తన పాదయాత్రకు షరతులతో హైకోర్టు అనుమతి ఇవ్వడంతో షర్మిల బుధవారం నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..