Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తొలిసారిగా అండర్ గ్రౌండ్ లో రూట్.. ఆ మార్గంలో అందుబాటులోకి..

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందని హైదరాబాద్ మెట్రో మరో అడుగు ముందుకేసింది. నగరంలో మొట్ట మొదటి సారిగా భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు..

Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తొలిసారిగా అండర్ గ్రౌండ్ లో రూట్.. ఆ మార్గంలో అందుబాటులోకి..
Hyderabad Metro Rail
Follow us

|

Updated on: Nov 29, 2022 | 9:10 PM

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందని హైదరాబాద్ మెట్రో మరో అడుగు ముందుకేసింది. నగరంలో మొట్ట మొదటి సారిగా భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు రెండో దశలో 31 కిలోమీటర్లు చేపట్టనున్న మెట్రో కారిడార్‌లో విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు అండర్‌ గ్రౌండ్ లో మెట్రో నిర్మించనున్నారు. ఈ మెట్రో కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్‌ ఐదేళ్ల వేడుకలను నిర్వహించారు. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మంది ప్రయాణించారన్న ఎన్వీఎస్ రెడ్డి.. ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా ప్రజలు రాకుపోకలు సాగిస్తున్నారని చెప్పారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9 న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని స్పష్టం చేశారు.

కాగా.. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెట్రోరైలు మొదటి దశను నవంబర్ 2017 లో నాగోల్ – అమీర్‌పేట – మియాపూర్ మార్గంతో ప్రారంభించారు. తరువాత ఎల్‌బీ నగర్-అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018 లో ప్రారంభించారు. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గాన్ని మార్చి 2019 న ప్రారంభించారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 7న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో మొదటి దశలో 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోవిడ్‌కంటే ముందే 5 లక్షల మంది ప్రయాణించగా ఇప్పుడా సంఖ్య తగ్గింది. ఇక ఎయిర్ పోర్ట్‌కు ప్రస్తుతం బస్సు లేదా క్యాబ్‌లపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. అయితే మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణికులు వేగంగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్