Telangana Politics: పోటీలో ఉండాలా.. తప్పుకోవాలా.. అంతర్మథనంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..
కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయాలన్న ఆలోచనను YS షర్మిల విరమించుకున్నారా? ఒంటరి పోటీకే ఆమె మొగ్గుచూపుతున్నారా? ఎన్నికలకు సంబంధించిన షర్మిల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? డెడ్‌లైన్స్, డైలామాకు ఫుల్‌స్టాప్ పెడతారా? తెలంగాణ ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు YTP కార్యవర్గం గురువారం సమావేశమవుతోంది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో షర్మిల అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి..
తెలంగాణ ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యవర్గం ఇవాళ జరుగనుంది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో షర్మిల అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కు ఏర్పడింద. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి బ్రేక్ పడినట్టుగానే ఉంది.
తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌తో షర్మిల అనేకసార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ట్రబుల్ షూటర్‌గా ఉన్న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కూడా అనేకసార్లు కలిశారు. షర్మిల డిమాండ్స్ విషయంలో తేడా రావడంతో విలీనం ఆగిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఒంటరిగానే పోటీ..!
ఈ క్రమంలో ఒంటరిగానే పోటీ చేయాలా..? లేదంటే ఏకంగా ఎన్నికలకు దూరంగా ఉండాలా.. అనేదానిపై షర్మిల అంతర్మథనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్నది ఆమె ఆలోచన అయితే.. ఎన్నికల తర్వాత ఆ దిశగా ఆమె చర్యలు చేపట్టవచ్చు. ఒకవేళ పోటీ చేయాలని నిర్ణయిస్తే షర్మిల ఒక్కరే బరిలోకి దిగాలా? మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను నిలపాలా అన్నది దానిపై కార్యవర్గ సమావేశంలో స్పష్టత రానుంది. ఒంటరిగా వైటీపీ ఎన్నికల రణరంగంలోకి దిగితే కేవలం షర్మిల ఒక్కరే పోటీ చేస్తారనే సంకేతాలు కనిపిస్తున్నా.. అటు ఆమె తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా బరిలోకి దిగొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. షర్మిల భవిష్యత్ ఏంటో ఇవాళ తేలిపోనుంది.
శపథం చేసిన నేపథ్యంలో..
షర్మిల ఒంటరిపోరుకు దిగితే.. కచ్చితంగా పాలేరు నుంచే పోటీ చేస్తారు. అప్పుడు ఎవరిని ప్రత్యర్ధిగా చూస్తారనేది ఆసక్తికర అంశం. బీఆర్ఎస్ అభ్యర్ధిని టార్గెట్ చేస్తారా లేదంటే పాలేరు టికెట్ ఆశిస్తున్న తుమ్మల నాగేశ్వరరావుతో ఫైట్ చేస్తారా? ఒకవేళ తుమ్మల గనక ఖమ్మం సీటు తీసుకుని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు బరిలో దిగితే మాత్రం.. పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది. ఒకవిధంగా ఇది షర్మిలను ఇరుకునపెట్టడమే అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తామని పొంగులేటి శపథం చేసిన నేపథ్యంలో షర్మిలను గెలవనివ్వకపోవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా.. విలీనంపై షర్మిల వేసిన అడుగులు లాభం కంటే నష్టమే ఎక్కువ తెచ్చిపెట్టింది. వైఎస్ మీద అభిమానం కావొచ్చు, సమస్యలపై షర్మిల పోరాడుతున్న తీరు కావొచ్చు. కొంతమంది నేతలైతే ఆమె వెనక నడిచారు. కాని, ఎప్పుడైతే విలీనం చేయాలనే ఆలోచన మొదలుపెట్టారో అప్పటి నుంచి ఒక్కో లీడర్ పార్టీని వీడుతూ వచ్చారు. కొండా రాఘవరెడ్డి, గట్టు రామచంద్రరావు, ఏపూరి సోమన్న.. ఇలాంటి వాళ్లంతా షర్మిల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు విలీనంపై వెనక్కి తగ్గినా.. మళ్లీ నేతలు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు.
ఒకటి లేదా రెండు రోజుల్లో..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే యోచనను విరమించుకున్నారని, నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో.. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని షర్మిల నిర్ణయించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆమె ఈ మేరకు ప్రకటన చేయనున్నారని అజ్ఞాత పరిస్థితిపై YSRTP కార్యకర్త ఒకరు తెలిపారు.
షర్మిల తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్ఆర్) జయంతి సందర్భంగా జూలై 8, 2021న వైఎస్ఆర్టీపీని ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం