Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: ఇద్దరి శరీరాలోనూ బుల్లెట్లు.. రాజకీయాల్లో మాత్రం ఉప్పు- నిప్పు.. ఈ హైదరాబాదీ నేతలు మీకు తెలుసా..

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు గతంలో పోటీ చేసి ఓడిపోయినవారు కూడా ఈసారి జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓట్లు, సీట్లు రావాలి. పని తీరుతోనే ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలి. జనాన్ని ఆకట్టుకోవాలి. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది. బహిరంగ సభలు, ప్రసంగాలు, విమర్శల స్టేజ్‌ ఎప్పుడో దాటిపోయింది. సోషల్‌ మీడియా వేదికగా పాలిట్రిక్స్‌ నడుస్తున్నాయి. రాజకీయం అంటే ఇదే.

Telangana Politics: ఇద్దరి శరీరాలోనూ బుల్లెట్లు.. రాజకీయాల్లో మాత్రం ఉప్పు- నిప్పు.. ఈ హైదరాబాదీ నేతలు మీకు తెలుసా..
Akbaruddin Owaisi And Firoz Khan
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Sanjay Kasula

Updated on: Oct 12, 2023 | 12:46 PM

హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎవరికి  వారు గెలుపుపై ధీమాతో దూసుకుపోతున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు గతంలో పోటీ చేసి ఓడిపోయినవారు కూడా ఈసారి జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓట్లు, సీట్లు రావాలి. పని తీరుతోనే ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలి. జనాన్ని ఆకట్టుకోవాలి. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది. బహిరంగ సభలు, ప్రసంగాలు, విమర్శల స్టేజ్‌ ఎప్పుడో దాటిపోయింది. సోషల్‌ మీడియా వేదికగా పాలిట్రిక్స్‌ నడుస్తున్నాయి. రాజకీయం అంటే ఇదే.

అచ్చం ఇలానే హైదరాబాద్‌లో ఓ ఇద్దరి నేతలు ప్రసంగాలతోనేకాదు.. సోషల్ మీడియాలో కూడా అదరగొడుతున్నారు. తమకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు. వీరిద్దరిలో ఇదొక్కటే పోలిక కాదు. వీరిద్దరి శరీరంలోనూ బుల్లెట్లు ఉన్నాయి.. పోలికలు ఒకేలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం నిప్పు-ఉప్పులా కొనసాగుతున్నారన్నారు.

2011 లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై ప్రత్యర్గివర్గం హత్యకు ప్లాన్ చేసింది. ఆయన ప్రత్యర్థులు ముందుగా కత్తులతో దాడిచేసి అక్బరుద్దీన్ ను తీవ్రంగా గాయపరిచారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌ ఎదురుకాల్పులు చేయడంతో నిందితులు పరారయ్యారు. కానీ ప్రత్యర్థుల దాడిలో అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 15, 17 కత్తి పోట్లు ఉండగా… అక్బరుద్దీన్‌ శరీరంలోకి బులెట్లు దూసుకుపోయాయి. ఇప్పటికీ ఓ బుల్లెట్ ఆయన శరీరరంలోనే ఉంది. ఆ బుల్లెట్ బయటకు తీస్తే కొన్ని అవయవాలు పనితీరు ఆగిపోతుందన్న డాక్టర్ల సూచనతో అలాగే ఉంచేశారు..

ఇదిలావుంటే, ఎప్పుడు ఎంఐఎం పార్టీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే కాంగ్రెస్ నేత ఫీరోజ్ ఖాన్ ఒంట్లో కూడా ఓ బుల్లెట్ ఉంది. ఫెరోజ్ ఖాన్ పై గతంలో ఓ ల్యాండ్ ఇష్యూలో కాల్పులు జరిపారు ప్రత్యర్థులు. ఆ దాడుల్లో ఒక బుల్లెట్ ఫెరోజ్ ఖాన్ శరీరంలో నే ఉండిపోయింది. ఫిరోజ్ ఖాన్ కూడా ఇబ్బంది పడుతున్నారు.

ఇలా నిత్యం ఇబ్బంది పడుతూ.. ప్రజా సేవలో ముందుటున్నారు ఈ ఇద్దరు నేతలు. తరుచూ రాజకీయ పార్టీల విమర్శిస్తూ ప్రజాసేవ కోసం ముందుకెళ్తున్న ఈ నేతలు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. తన ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి ప్రజాసేవ కోసం ముందుకు వెళ్తున్న ఈ నేతలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

ఈసారి బస్తీమే సవాల్ అంటూ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ చంద్రాయన గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం మొదలు పెట్టారు. వీరు పోటీ చేసిన చోట ఎన్నికల హడావుడి అంతా ఉండకపోయినా.. నిత్యం వీళ్ళు చేసే ప్రసంగాలు సోషల్ మీడియాలో కాంట్రావెర్సికి కేంద్ర బిందువు మారుతుంటాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి