YS Sharmila: రేపటి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం.. అపిన చోట నుంచే.. పొలిటికల్ హీట్ పెంచుతున్న షర్మిల ఇష్యూ..

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత రేపిన వైఎస్. షర్మిల అరెస్టు ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. రేపటి (గురువారం) నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం  కానుంది. అపిన...

YS Sharmila: రేపటి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం.. అపిన చోట నుంచే.. పొలిటికల్ హీట్ పెంచుతున్న షర్మిల ఇష్యూ..
YS Sharmila
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2022 | 10:39 PM

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత రేపిన వైఎస్. షర్మిల అరెస్టు ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. రేపటి (గురువారం) నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం  కానుంది. అపిన చోట నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. ఇవాళ ముఖ్య నాయకులతో భేటీ అయిన తర్వాత మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నిన్నటి పరిణామాల పై మీడియా తో మరోసారి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. నర్సంపేటలో తమ వాహనాలపై దాడి చేసిన ఘటనకు నిరసనగా వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ధ్వంసమైన కారులోనే నిరసన తెలిపేందుకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. వాహనం దిగాలని కోరారు. అయినా ఆమె దిగకపోవడంతో కారుతో సహా క్రేన్ సహాయంతో బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో అభిమానులు, కార్యకర్తలుల ఆందోళన చేశారు. ఈ పరిస్థితుల నడుమ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం తీవ్ర నాటకీయ పరిస్థితుల మధ్య వైఎస్.షర్మిలకు బెయిల్ మంజూరు అయింది. అంతే కాకుండా ఆమె పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక మహిళ అయి ఉండి రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. సీఏం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, సీబీఎస్‌సీ సిలబస్‌లో విద్యా బోధన, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువులు, మహిళలకు 12 శాతం రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు. ఇలా ఇచ్చిన ఏ హామీని సీఏం కేసీఆర్ అమలుచేయలేదు. వీటిని నెరవేర్చాలని ప్రజల పక్షాన మాట్లాడటమే తప్పా. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా, తెలంగాణ ఏమైనా అఫ్గానిస్థానా.. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తమ కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. బూటు కాళ్లతో తన్నారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు పార్టీ నాయకులకు గాయాలయ్యాయన్నారు. అరెస్టు చేశాక.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాలి. కానీ అరెస్ట్ చేశాక కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు.

– వైఎస్. షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు

ఇవి కూడా చదవండి

కాగా షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని పోలీసుల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో వీడియో తీసేందుకు యత్నించిన పోలీసు అధికారి నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపించారు.దీంతో అధికారి విధులను అడ్డుకున్నట్టేనని కూడా తెలిపారు. ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో హల్ చల్ చేశారని, శాంతి భద్రతలను పరిరక్షించేందుకే ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.వాదనలు విన్న ధర్మాసనం షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్రకు షరతులతో హైకోర్టు అనుమతి ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.