AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో షర్మిల అడుగులపై సర్వత్రా ఆసక్తి, పక్కాప్లానింగ్‌తో వరుస భేటీలు.. జోరుగా కొత్త పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్

Sharmila New Party : వైఎస్‌ షర్మిల. తెలంగాణలో ఇప్పుడు ఎక్కువగా విసిపిస్తోన్న పేరు. ఆ పేరు వినగానే ఒక్కటే ఆలోచన. ఆమె ఇప్పుడు ఏమి ప్రకటించబోతున్నారు అని. ఎందుకంటే

తెలంగాణలో షర్మిల అడుగులపై సర్వత్రా ఆసక్తి, పక్కాప్లానింగ్‌తో వరుస భేటీలు.. జోరుగా కొత్త పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్
Venkata Narayana
|

Updated on: Feb 20, 2021 | 12:11 PM

Share

Sharmila New Party :  వైఎస్‌ షర్మిల. తెలంగాణలో ఇప్పుడు ఎక్కువగా విసిపిస్తోన్న పేరు. ఆ పేరు వినగానే ఒక్కటే ఆలోచన. ఆమె ఇప్పుడు ఏమి ప్రకటించబోతున్నారు అని. ఎందుకంటే కొత్త పార్టీ పెడతామన్న షర్మిలవైపే అందరి చూపు. అదే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతోన్న షర్మిల ఈ రోజు అభిమానులతో మరో భేటీ షురూ చేశారు. మరి ఈ సమావేశం ప్రణాళికేంటి.? దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటి.? ఇప్పుడిది తెలంగాణలోనేకాదు, అటు ఏపీలోనూ హాట్ టాపిక్ అయింది.

తెలంగాణ అభిమానులతో వారంలో రెండోసారి షర్మిల సమావేశమవుతున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రసుత్తం గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పర్యటనలు వాయిదా పడినా.. నేతలతో మాత్రం వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ వరుస సమావేశాలతో కొత్త పార్టీ ఏర్పాటు గురించే ప్రధానంగా చర్చ జరగుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు షర్మిల.

ఓ వైపు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడుతునే, తెలంగాణలోని వైఎస్‌ఆర్‌ అభిమానులు, వివిధ సామాజిక వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకున్న తరువాత, పార్టీ ఏర్పాటుకు ఇంకా సమయం ఉంటే.. చేవెళ్ల నుంచే యాత్రను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అటు పాలమూరుకు చెందిన ఓ పార్టీ నాయకుడు షర్మిలతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చినంటూ తెలుస్తోంది. ఈ ఆత్మీయ సమ్మేళనాలు ముగిసిన తర్వాత షర్మిల జిల్లా పర్యటన చేసే అవకాశముంది.

కొత్త పార్టీ ఏర్పాటు, లక్ష్యాలకు సంబంధించిన ప్రణాళికను జిల్లా నేతలకు ఆమె వివరిస్తున్నట్లు సమాచారం. తనతో కలిసి నడిచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న అభిమానులు, మద్దతుదారుల నుంచి షర్మిల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వారి సలహాలు, సూచనలకు విలువ ఇచ్చి ముందడుగు వేసే అవకాశం ఉంది. కాగా, తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు అంశం తెలుగురాష్ట్రాల్లో కొత్త చర్చకు దారితీసింది.

Read also :  సాగర తీరంలో స్టీల్‌ పాలిటిక్స్‌…! విశాఖ ఉక్కు పోరాటానికి పరిరక్షణ యాత్రతో నాంది పలికామన్న విజయసాయిరెడ్డి