Hyderabad: ఎన్నికల వేళ సొంతూర్లకు తరలివెళ్తున్న ప్రజలు.. కిక్కిరిసిన బస్టాండ్, రైల్వే స్టేషన్లు
ఎన్నికలకు సొంతూర్లకు తరలివెళ్తున్నారు ఏపీ ప్రజలు. వీకెండ్ కావడంతో ఒకరోజు ముందే తమ సొంతూళ్లకు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాయకులు, రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం హడావిడి కనిపించింది. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి నెలకొంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరం ఎటు చూసినా బస్ స్టాపుల వద్ద బ్యాగులు పట్టుకుని యువత దర్శనమిస్తున్నారు.

ఎన్నికలకు సొంతూర్లకు తరలివెళ్తున్నారు ఏపీ ప్రజలు. వీకెండ్ కావడంతో ఒకరోజు ముందే తమ సొంతూళ్లకు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాయకులు, రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం హడావిడి కనిపించింది. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి నెలకొంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరం ఎటు చూసినా బస్ స్టాపుల వద్ద బ్యాగులు పట్టుకుని యువత దర్శనమిస్తున్నారు. అటు సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్ రైల్వేస్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీకి వెళ్లే రైళ్ల దగ్గర జనజాతర కనిపిస్తోంది. ఇప్పటికే బస్సులన్నీ రిజర్వేషన్ అయిపోవడంతో ఖాళీ ఎక్కడా దొరక్క ట్రైన్స్‌కు వెళ్తున్నారు జనం. రైలులో సీటు కోసం ఆరాటపడుతున్నారు. ఏపీకి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రైల్వే అధికారులు. అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అదనంగా పలు రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే కొందరు తమ సొంత వాహనాల్లోనూ పెద్ద ఎత్తున ఊర్లకు తరలివెళ్తున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్, ఓట్ల జాతర రెండూ కలిసి రావడంతో.. ఉదయం నుంచే భారీగా వెళ్తున్నారు. పంతంగి.. కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర రష్ ఉండటంతో.. హైదరాబాద్ నుంచి ఏపీవైపు వెళ్లేందుకు ఎక్కువ టోల్ బూత్స్ ఓపెన్ చేశారు. ఇటు ఏపీ, తెలంగాణాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చిన వారు తిరిగి పల్లెబాట పడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా భావించి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పెద్ద ఎత్తున టికెట్ ధరలను పెంచేసింది. దీనిపై ట్రాన్స్ పోర్ట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఙప్తి చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సు సర్వీసులు పరిమితంగా ఉన్నప్పటికీ ఎన్నికల కోసం మరిన్ని బస్సులు అందుబాటులో ఉంచుతామని చెబుతోంది తెలంగాణ ఆర్టీసీ. అవసరానికి అనుగుణంగా బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతామని, ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఏపీకి వెళ్లే వారికోసం ప్రత్యేకంగా బస్సుల సంఖ్యను పెంచుతామంటోంది టీఎస్ఆర్టీసీ. పెద్ద ఎత్తున రద్దీగా ఉండే భాగ్యనగరం ఓట్ల జాతర నేపథ్యంలో బోసిపోయి తక్కువ ట్రాఫిక్ కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




