నగరంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాల్లో వీరిపాత్ర కీలకం.. స్థానికులు ఆగ్రహం..

హైదరాబాద్ నగరంలో నానాటికి పెరిగిపోతున్న నేరాలను అదుపు చేస్తామని అధికారులు పదేపదే చెబుతున్నారు. అందుకు కావాల్సిన పటిష్టమైన చర్యలు చేపట్టి వాటని అరికట్టడం లేదని నగరవాసులు అంటున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వాడకాలు, వాటి అమ్మకాలు మాత్రం పెద్దఎత్తున జరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా ఇలాంటి నేర ప్రవృత్తిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిలో మైనర్ యువకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. దీనిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని నగరవాసులు విజ్ఙప్తి చేస్తున్నారు.

నగరంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాల్లో వీరిపాత్ర కీలకం.. స్థానికులు ఆగ్రహం..
Hyderabad
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 03, 2024 | 8:37 AM

హైదరాబాద్ నగరంలో నానాటికి పెరిగిపోతున్న నేరాలను అదుపు చేస్తామని అధికారులు పదేపదే చెబుతున్నారు. అందుకు కావాల్సిన పటిష్టమైన చర్యలు చేపట్టి వాటని అరికట్టడం లేదని నగరవాసులు అంటున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వాడకాలు, వాటి అమ్మకాలు మాత్రం పెద్దఎత్తున జరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా ఇలాంటి నేర ప్రవృత్తిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిలో మైనర్ యువకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. దీనిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని నగరవాసులు విజ్ఙప్తి చేస్తున్నారు.

చదువులపై సరిగా దృష్టి పెట్టని నగరంలోని యువత.. చాలా వరకు ఇలాంటి అసాంఘిక చర్యల్లో మునిగిపోతున్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాల ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు అనే ఆశ వల్లనో, లేక ఇళ్లల్లో పిల్లలను సరైన దారిలో పెట్టే పెద్దవారు లేకపోవడంతోనో చాలా మంది యువత ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు. అక్రమ చర్యల వల్ల సంపాదించి జల్సాలకు అలవాటు పడిన యువత దీని నుంచి అంత తొందరగా బయటకు రావడం కష్టంగా మారింది. మత్తు టాబ్లెట్స్, ఇంజక్షన్లు వంటి ఇతర సామగ్రిని మైనర్ యువకులే తమ ఇళ్ల నుంచే అమ్ముతూ గుట్టు చప్పుడు కాకుండా సంపాదించేస్తున్నారు. సంపాదన మాట అటు ఉంచితే ఈ వయసులోనే ఇలాంటి చర్యలకు అలవాటు పడితే భవిష్యత్తు మరింత దుర్భరంగా ఉంటుందనేది కొందరి అభిప్రాయం.

ఏదైనా నేరం జరిగినప్పుడు కేసు నమోదు చేసి హడావిడిగా విచారణ చేపట్టి పోలీసు వ్యవస్థ చేతులు దులిపేసుకుంటోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అమాయక ప్రజల్ని చితకబాది నేరస్తుల్ని వదిలేస్తున్నారంటూ నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలను మైనర్ యువకులు అమ్ముతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దేశానికి యువతే వెన్నెముక అని మాటలు చెప్పే సంబంధిత అధికారులు, పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..