పాత బకాయిలు అడిగారని.. మొబైల్ షాప్ ధ్వంసం.. వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగినందుకు ఏకంగా షాపు సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కూకట్ పల్లికి చెందిన అఖిల్ అనే యువకుడు తన అనుచరులతో వచ్చి అమీర్‌పేటలోని నీలగిరి బ్లాక్‌లో ఉన్న మొబైల్ రిపేరీ షాపు నిర్వాహకుడితో పాటు అతని సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా షాపులోని సామగ్రిని సైతం ధ్వంసం చేశాడు.
పాత బకాయిలు అడిగినందుకు ఏకంగా షాపు సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కూకట్ పల్లికి చెందిన అఖిల్ అనే యువకుడు తన అనుచరులతో వచ్చి అమీర్‌పేటలోని నీలగిరి బ్లాక్‌లో ఉన్న మొబైల్ రిపేరీ షాపు నిర్వాహకుడితో పాటు అతని సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా షాపులోని సామగ్రిని సైతం ధ్వంసం చేశాడు. ఆ షాపు సిబ్బంది ఆ యువకుడికి పాత బకాయిలు చెల్లించాలని అడగడమే ఈ గొడవకు కారణమైందని తెలిసింది. షాపు సిబ్బందిపై ఆ యువకులు దాడి చేయడం, షాపులోని సామాన్లను ధ్వంసం చేయడం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఎస్ ఆర్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

