Relationship: ఆటో డ్రైవర్‌తో యువతి సహజీవనం.. కొద్దిరోజుల్లో పెళ్లి, అంతలోనే ఊహించని షాక్!

మారుతున్న కాలమో.. లేదా సినిమాల వ్యామోహమో కానీ.. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు డేటింగ్ పేరుతో రెచ్చిపోతున్నారు. లివింగ్ రిలేషన్, వన్ నైట్ స్టాండ్ లాంటి విచిత్ర పోకడలతో తమ లైఫ్ ను స్పాయిల్ చేసుకుంటున్నారు. అర్ధం లేని ఆకర్షణతో చిత్తుగా మోసపోతున్నారు. అయితే ఒకప్పుడు ఇతర దేశాల్లో ఉండే లివింగ్ రిలేషన్ ఈరోజుల్లో మారుమూల గ్రామాల్లో కనిపిస్తుండటం కలకలం రేపుతోంది.

Relationship: ఆటో డ్రైవర్‌తో యువతి సహజీవనం.. కొద్దిరోజుల్లో పెళ్లి, అంతలోనే ఊహించని షాక్!
Relation
Follow us
Balu Jajala

|

Updated on: Apr 15, 2024 | 10:08 AM

మారుతున్న కాలమో.. లేదా సినిమాల వ్యామోహమో కానీ.. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు డేటింగ్ పేరుతో రెచ్చిపోతున్నారు. లివింగ్ రిలేషన్, వన్ నైట్ స్టాండ్ లాంటి విచిత్ర పోకడలతో తమ లైఫ్ ను స్పాయిల్ చేసుకుంటున్నారు. అర్ధం లేని ఆకర్షణతో చిత్తుగా మోసపోతున్నారు. అయితే ఒకప్పుడు ఇతర దేశాల్లో ఉండే లివింగ్ రిలేషన్ ఈరోజుల్లో మారుమూల గ్రామాల్లో కనిపిస్తుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఓ అమ్మాయి ఆకర్షణ పేరుతో ఓ ఆటో డ్రైవర్ ను ప్రేమించి, విలువైన జీవితాన్ని కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే..

నల్లగొండ జిల్లా కోదాడ మండలం నాగులపల్లి తండాలో ఓ యువతి(24) ఆత్మహత్యకు పాల్పడింది. రథావత్ జ్యోతి అనే యువతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ తల్లిదండ్రులకు కనిపించడంతో షాక్ అయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతి తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకువచ్చింది. ఏప్రిల్ 21న జ్యోతి తన ఐదేళ్ల బాయ్ ఫ్రెండ్ తో వివాహం జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఉగాదికి ఆమె ఇంటికి వచ్చింది. వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తున్న యువతికి సూర్యాపేట జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ వీరబాబుతో పరిచయం ఏర్పడింది.

జ్యోతి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరబాబు, జ్యోతి గత తొమ్మిది నెలలుగా హైదరాబాద్ లోని గదిలో సహజీవనం చేస్తున్నారు. శారీరకంగా ఒకటి అయ్యారు. అయితే పెళ్లికి ఒప్పుకునే ముందు డబ్బు, బంగారం, భూమి కావాలని అడిగాడు. అందుకు అంగీకరించి ముందుగానే బైక్ ఇచ్చాం’ అని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. అయినా వీరబాబు సంతృప్తి చెందలేదు. పెళ్లికి ముందే భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేయించాలని జ్యోతిని వేధించడం మొదలుపెట్టాడు. నిత్యం గొడవలతో విసిగిపోయిన ఆమె పండుగ కోసం తండాలోని తన గ్రామానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ పరిశీలించారు.