AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అర్ధరాత్రి భయానకం.. స్మశానంలో శవాల భస్మం పూసుకుని.. ఏవో పిచ్చి మంత్రాలు చదువుతూ

ఒంటి మీద నూలు పోగు లేదు. స్మశానంలో శవాల బూడిదను ఒళ్లంతా పులుముకున్నాడు. ఇక ఏవో మంత్రాలు బిగ్గరగా చదవడం ప్రారంభించారు. అలాంటి మనిషి చూసి ఎవరైనా హడలిపోకుండా ఉంటారా...?

Telangana: అర్ధరాత్రి భయానకం.. స్మశానంలో శవాల భస్మం పూసుకుని.. ఏవో పిచ్చి మంత్రాలు చదువుతూ
Tantrika Puja
Ram Naramaneni
|

Updated on: May 18, 2023 | 4:27 PM

Share

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె స్మశాన వాటికలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం చెలరేగింది. స్మశాన వాటికలో గుర్తుతెలియని యువకుడు నగ్నంగా నిలబడి.. ఏవో పిచ్చి పూజలు చేశాడు. దహన సంస్కారాలు చేసిన బుడిదను శరీరమంతా పులుముకుని.. ఏవో మంత్రాలు చదివాడు. స్మశాన వాటికలో యువకుడి ప్రవర్తన చూసి.. స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు యువకులు ధైర్యం చేసి కర్రలు పట్టుకుని.. అతడిని వెళ్లగొట్టారు.

పట్టణంలోని పలు వీధుల గుండా అర్దరాత్రి ఆ యువకుడు నగ్నంగా తిరుగుతుండం చూసి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అతడు ఎవరు.. ఎందుకు అలా నగ్నంగా స్మశానంలో పూజలు చేశాడు..? మతి స్థిమితం కోల్పోయాడా..? లేదా కావాలనే చేశాడా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై తమకు కూడా సమాచారం అందిందని.. వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో చేతబడులు, క్షుద్రపూజల అపోహలు ఉంటే తొలగిస్తామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..