Hyderabad: 6 నెలల క్రితం కులాంతర వివాహం.. తొలిసారి అత్తగారి ఇంటికి వెళ్లిన యువకుడు.. రాగానే..

హైదరాబాద్‌ వనస్థలిపురంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న గోపినాయక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: 6 నెలల క్రితం కులాంతర వివాహం.. తొలిసారి అత్తగారి ఇంటికి వెళ్లిన యువకుడు.. రాగానే..
Young Man Suicide
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 09, 2023 | 6:46 PM

హైదరాబాద్‌ హస్తినపురానికి చెందిన ఓ యువతిని గోపినాయక్‌ అనే యువకుడు ఆరు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. యువతి తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. ప్రేమ వివాహం చేసుకున్న గోపినాయక్‌ దంపతులను యువతి తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం ఇంటికి పిలిపించారు. ఈ క్రమంలో.. ఏం జరిగిందో ఏమో గానీ.. నిన్న రాత్రి గోపినాయక్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో.. గోపినాయక్‌ మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.

యువతి తల్లిదండ్రులు కుల పరంగా అవమానించడంతోనే గోపినాయక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. గోపినాయక్‌ మృతికి కారణమైన యువతి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేయాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు. కులాంతర వివాహానికి ఒప్పుకోని యువతి ఫ్యామిలీ.. గోపినాయక్‌ను నమ్మించి.. ఇంటికి పిలిచి అవమానించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..