Hyderabad: బాత్రూమ్‌లో విద్యుత్ షాక్ తో మృతి చెందిన నవ దంపతులు..పెళ్ళైన రెండు నెలలకే దుర్ఘటన..
ఈ హృదయ విదారక ఘటన గురువారం ఉదయం జరిగగా రాత్రి సమయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాత్ రూంలో ఉన్న గ్రీజర్ ఎలక్ట్రిక్ షాక్ కు గురి కావడంతో దంపతులు ఇద్దరు మరణించినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి జరిగి రెండు నెలలు కావస్తుంది .. భార్య భర్తలు ఇద్దరూ డాక్టర్ వృత్తిలో ఉన్నారు.. అయితే మృత్యువు విద్యుత్ షాక్ రూపంలో వచ్చి ఈ కొత్త జంటను బలితీసుకుంది. భర్త md చేసి సూర్యాపేటలో ఓ మెడికల్ కాలేజీలో asst ప్రొఫెసర్ గా పనిచేస్తుండగా, భార్య హైదరాబాద్ డెక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీస్ చివరి సంవత్సరం చదువుతుంది. విధి వక్రీకరించింది కొత్తగా పెళ్లయిన జంట స్పాట్ డెడ్ అయ్యారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
లంగర్ హౌస్ లోని ఖాదర్ బాగ్ లో ఈ కొత్త జంట నివాసం ఉంటున్నారు. 26 సంవత్సరాలు సయ్యద్ నిసార్ ఉద్దీన్ కు డెక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీస్ చదువుతున్న ఉమ్మె మొహిమీన్ సైమా తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నవ దంపతులు ఇద్దరూ వైద్యులు కావడం, జంటగా మరణించడం ఇరువురి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
ఈ హృదయ విదారక ఘటన గురువారం ఉదయం జరిగగా రాత్రి సమయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాత్ రూంలో ఉన్న గ్రీజర్ ఎలక్ట్రిక్ షాక్ కు గురి కావడంతో దంపతులు ఇద్దరు మరణించినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఉమ్మె మొహిమీన్ తన అత్త ఇంటి సభ్యులైన సైమా కుటుంబ సభ్యులతో ఉదయం మాట్లాడిన తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. తన కూతురును కాపాడబోయి తన అల్లుడు కూడా మరణించినట్లు ఉమ్మె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువురి డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం.. ఉస్మానియాకు తరలించారు. ఈ ప్రమాదానికి కారణం గ్రీజర్ ఎలక్ట్రిక్ షాక్ వల్లే మరణించినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.




reporter: Anil
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
