Special Holiday: మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అందరికీ సెలవు ప్రకటించిన రాష్ట్ర సర్కార్
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు..

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు తెలియజేస్తూ ఆదివారం (మార్చి 5) కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం నాడు సెలవు వర్తిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెల్పింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది.
కాగా ప్రతి ఏటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని మార్చి 8న రాష్ట్ర సర్కార్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తున్న విషయం తెలిసింఏద. అలాగే ఈ ఏడాది కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 8న హోలీ పండుగ కూడా ఉండటంలో విద్యాసంస్ధలకు ఆరోజు సెలవు ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏ మేరకు ఎదుగుతున్నారో గుర్తించే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ రోజున ఘనంగా జరుపుకుంటాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
