Hyderabad: ఉద్యోగం కోసం వచ్చి అదృశ్యమైన యువతి.. ఆ తరువాత ఏం జరిగిందింటే..
Hyderabad: హైదరాబాద్‌లో దారఉణం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం వచ్చిన యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం వచ్చిన యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన చింతపల్లి శారద(25) కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలో శ్రీనివాస్ నగర్‌లో ఉన్న తన చిన్నమ్మ చంద్రమ్మ ఇంట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా.. ప్రైవేటు కంపెనీలలో జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ కనిపించకుండా పోయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి.. రాత్రి అయినా రాకపోవడంతో చంద్రమ్మ కంగారు పడింది. వెంటనే విషయాన్ని యువతి తండ్రి శేఖర్‌కు తెలిపింది. శేఖర్ హుటాహుటిని హైదరాబాద్‌కు వచ్చాడు. బంధువులతో కలిసి వెళ్లి.. కూతురు మిస్సింగ్ గురించి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Also read:
Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..
Earthquake: పాకిస్తాన్‌లో అర్థరాత్రి భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు.. తీవ్రత ఎంతంటే..
IND vs ENG 2nd Test: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 45 ఓవర్లకు 119/3..