- Telugu News Photo Gallery Viral photos Paper Tea: How This Adilabad Chai Wala Is Brewing Tea With Newspaper Bowls
Paper Chai Maker: న్యూస్ పేపర్ బౌల్స్‌తో టీ తయారు చేస్తున్న ఓ వ్యక్తి.. ఎక్కడ.. ఎలా అంటే..
Paper Chai Maker: మనిషి తలచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాడు.. తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకుని.. చరిత్ర ఒక పేజీ లిఖించుకుంటాడు. ఈ కోవలోకి వస్తుంది పేపర్ టీ.. అదెంటిమి ఇప్పటి వరకూ మట్కా చాయ్, లేమాన్ టీ , బాదాం టీ , గ్రీన్ టీ వంటి అనేక రకాల టీల గురించి విన్నాం.. పేపర్ టీ ఏమిటి అనుకుంటున్నారా..అవును.. వేడి వేడి తేనీరుని గిన్నెలో కాకుండా ఒక పేపర్ ని బౌల్ గా చేసి.. దానిని పొయ్యిమీద పెట్టి.. టీ తయారు చేస్తున్నాడు.
Updated on: Aug 14, 2021 | 7:34 AM

అందరిలా గిన్నె లో టీ తయారు చేస్తే తన గొప్ప ఏముంది అనుకున్నాడు ఆదిలాబాద్ జిల్లా చాందాటి గ్రామానికి చెందిన హన్నుబాయ్. కాగితంలో చాయ్ ని తయారు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు హన్నుబాయ్

20 ఏళ్ల క్రితం మోదుగ ఆకుల్లో టీ తయారు చేసేవారిని చూసి స్ఫూర్తి పొందిన హన్నుబాయి.. డిఫరెంట్ గా తానూ కూడా ఏదైనా చేయాలనీ భావించాడు.. అప్పుడు పుట్టిన ఆలోచనే పేపర్ టీ తయారు చేయడం.

మొదటి పేపర్ లో టీ తయారు చేసినప్పుడు ఎవరూ నమ్మలేదని.. తర్వాత హన్నుభాయి తయారు చేయడం స్వయంగా చేయడం చూసిన తర్వాత అందరికీ నమ్మకం కలిగిందని స్థానికులు చెప్పారు.

తమకు అలా పేపర్ లో టీ తయారు చేసి ఇవ్వడం నచ్చిందని.. అప్పటి నుంచి తాము రెగ్యులర్ గా ఇక్కడే టీ తాగుతున్నామని ఏది ఏమైనా పేపర్ చాయ్ టెస్ట్ డిఫరెంట్ అని అంటున్నారు తేనీరు ప్రేమికులు

ఇలా పేపర్ ని గిన్నెలా చేసి పొయ్యి మీద పెట్టి టీ తయారు చేయడానికి ఒక సైన్స్ కిటుకు ఉందని స్థానిక నిపుణులు అంటున్నారు. కాగితం తడిపొడి కలయికతో జ్వలనం చేయడం వలెనే ఇది సాధ్యమైందని చెప్పారు.
