ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు..
బాంబులు,తుపాకులు పేలినట్టు ఇళ్లలోని కరెంటు స్విచ్చు బోర్డులు పేలిపోతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ మహిళ మృతి చెందగా, ఒక ఇళ్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయింది. జరిగిన ప్రమాదంతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన తాటికొండ కళావతి అనే మహిళ సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ఒకేసారి షాక్ తగిలి కిందపడిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి […]

బాంబులు,తుపాకులు పేలినట్టు ఇళ్లలోని కరెంటు స్విచ్చు బోర్డులు పేలిపోతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ మహిళ మృతి చెందగా, ఒక ఇళ్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయింది. జరిగిన ప్రమాదంతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన తాటికొండ కళావతి అనే మహిళ సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ఒకేసారి షాక్ తగిలి కిందపడిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కళావతి మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, పక్కనే ఉన్న తాటికొండ నర్సింహులు అనే వ్యక్తి పూరి గుడిసె పూర్తిగా తగలబడిపోయింది. నర్సింహులు చిట్టీలు వేసి దాచుకున్న మూడు లక్షల రూపాయలు కూడా గుడిసెలోనే మంటల్లో కాలిపోయాయంటూ బాధితుడు బోరున విలపించాడు. జరిగిన ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు మండిపడ్డారు. బాధిత కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




