హైదరాబాద్‌లో మరో యువతి మిస్సింగ్..!

హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌లో గాయత్రి(19) అనే యువతి అదృశ్యమైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో సూపర్ మార్కెట్‌కి వెళ్లి వస్తానని చెప్పిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో పేరేంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా పోలీసులు తెలుపుతోన్న వివరాల ప్రకారం..ఇష్టం […]

హైదరాబాద్‌లో మరో యువతి మిస్సింగ్..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 19, 2019 | 9:01 PM

హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌లో గాయత్రి(19) అనే యువతి అదృశ్యమైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో సూపర్ మార్కెట్‌కి వెళ్లి వస్తానని చెప్పిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో పేరేంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా పోలీసులు తెలుపుతోన్న వివరాల ప్రకారం..ఇష్టం లేని పెళ్లి చేస్తారన్న అనుమానంతోనే ఆమె బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా యువతీ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్, స్విచ్ఛాన్ అవుతుండటంతో,  సిగ్నల్ లొకేషన్ కనుక్కోవడం పోలీసులకు కష్టతరంగా మారినట్టు సమాచారం.