Telangana: తాంత్రికపూజల నెపంతో మహిళ సజీవదహనం.. ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్థులు

మెదక్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాంత్రిక పూజలు చేస్తుందన్న నేపంతో గ్రామస్థులు ఆమెపై దాడికి తెగబడ్డారు. బతికుండగానే ఒంటిపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది..

Telangana: తాంత్రికపూజల నెపంతో మహిళ సజీవదహనం.. ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్థులు
Woman Burnt Alive By Villagers
Follow us
P Shivteja

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 04, 2024 | 8:06 PM

రామాయంపేట, అక్టోబర్‌ 4: మెదక్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాంత్రిక పూజలు చేస్తుందన్న నేపంతో గ్రామస్థులు ఆమెపై దాడికి తెగబడ్డారు. బతికుండగానే ఒంటిపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

మెదక్‌ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో ద్యాగల ముత్తవ్వ అనే మహిళ తన ఇంట్లో ఉండగా గురువారం రాత్రి గ్రామస్థులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. ఆమె తాంత్రిక పూజలు చేస్తుందని, మంత్రతంత్రాలు ప్రయోగిస్తుందన్న నెపంతో ముత్తవ్వ ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అరుపులు విన్న స్థానికులు కొందరు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. పోలీసులు హుటాహుటీన అక్కడకు వచ్చి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.

మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థుల దాడి భయంతో అదే ఇంట్లో బాధితురాలితోపాటు ఉంటున్న ఆమె కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోఘటన: మేడ్చల్‌ జిల్లాలోని చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మూడుచింతలపల్లి మండలం కొల్తూరులో చెరువు ఇటీవల కురుసిన వర్షాలకు నిండుకుండలా ఉంది. అందులో ప్రమాదవశాత్తు పడిపోయిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హర్ష, మణికంఠ, మనోజ్‌గా గుర్తించారు. వీరంతా 15 ఏళ్లలోపు బాలురు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.