Watch: బీఆర్ఎస్ నిరసన సభలో నవ్వులే నవ్వులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

బీఆర్ఎస్ రైతు రుణం ధర్నాలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పంచలోకి తొండ జొరబడింది. పంచ నుండి షర్ట్‌పైకి పాకి కాసేపు సభ వేదిక వద్ద చుక్కలు చూపించింది.

Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Oct 04, 2024 | 5:38 PM

బీఆర్ఎస్ రైతు రుణం ధర్నాలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పంచలోకి తొండ జొరబడింది. పంచ నుండి షర్ట్‌పైకి పాకి కాసేపు సభ వేదిక వద్ద చుక్కలు చూపించింది. దీంతో ఆ ప్రాంతమంతా నవ్వులు పువ్వులు కురిపించింది. ఆ తొండలు తనను ఏం చేయలేవన్న రాజయ్య, దాన్ని తీసి బయట పారేయడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరులో రైతు రణం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA హరీష్ రావు తోపాటు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ MLC లు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది

స్టేజీపై రాజయ్య మాట్లాడుతుండగా, ఎక్కడ నుంచి వచ్చిందో గానీ, ఓ తొండ దూసుకొచ్చింది. భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పక్కకి జరుగగా, తొండకు భయపడతరా.. అంటూ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిల్చోని మాట్లాడుతున్న రాజయ్య దోతీ పైకెక్కి, షర్ట్ లోపలికి చొరబడింది. ఓ చేతితో మైక్ పట్టుకున్న రాజయ్య, మరో చేతితో తొండను షర్టుతో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు రాజయ్య షర్ట్ బటన్స్ విప్పి కండువాతో తొండను బంధించి, పక్కన విసిరేశారు. ఇది ప్రభుత్వ కుట్ర అంటూ కాసేపు నవ్వులు పూయించారు తాటికొండ రాజయ్య. ఆ తొండలు మనల్ని ఏం చేస్తాయి అంటున్న క్రమంలో పంచలోకి ఆ తొండ చొరబడడం విశేషం..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు