AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమ్మ బాబోయ్.. వీరి వేషాలు మామూలుగా లేవుగా..! ఓ లేడీ లీడర్‌ కనుసన్నల్లో అంతా..!

ఖాళీ జాగా కన్పిస్తే కబ్జా చేయడం ఒక లెక్క..! ఓనర్‌కు తెలియకుండా ఒకరికి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయడం మరో లెక్క..! ఈ రెండు ఫార్మూలాతో చెలరేగిన ఓ ఘరానా గ్యాంగ్‌ భరతం పట్టారు హైదరాబాద్ మహానగర పోలీసులు.

Hyderabad: అమ్మ బాబోయ్.. వీరి వేషాలు మామూలుగా లేవుగా..! ఓ లేడీ లీడర్‌ కనుసన్నల్లో అంతా..!
Lady Leader Gang
Balaraju Goud
|

Updated on: Oct 05, 2024 | 4:23 PM

Share

ఖాళీ జాగా కన్పిస్తే కబ్జా చేయడం ఒక లెక్క..! ఓనర్‌కు తెలియకుండా ఒకరికి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయడం మరో లెక్క..! ఈ రెండు ఫార్మూలాతో చెలరేగిన ఓ ఘరానా గ్యాంగ్‌ భరతం పట్టారు హైదరాబాద్ మహానగర పోలీసులు. ఓ లేడీ లీడర్‌ కనుసన్నల్లో ఫేక్‌ డాక్యుమెంట్లతో కబ్జాలకు పాల్పడుతోన్న ముఠా గట్టు రట్టయింది.

హైదరాబాద్ మహానగరంలో మాయగాళ్లు మళ్లీ మోపయ్యారు. ఫేక్‌ డాక్యుమెంట్స్‌ సృష్టించి ల్యాండ్‌ కబ్జాలకు పాల్పడుతోన్న ఘరానా గ్యాంగ్‌కు చెక్‌ పెట్టారు బాలానగర్‌ పోలీసులు. ఫేక్‌ డాక్యుమెంట్లతో కబ్జాలకు పాల్పడుతోన్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు జీడిమెట్ల పోలీసులు. ఆధార్, పాన్ కార్డ్‌, డెత్‌ సర్టిఫికెట్‌ ఇలా అన్నింటిని నకిలీ చేసి ఫేక్‌ డాక్యుమెంట్లతో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు కేటుగాళ్లు. ఈ దందాలో పద్మజ రెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క ప్రధాన నిందితురాలిగా గుర్తించారు.

ఈ ముఠా గత కొంత కాలంగా బతికి ఉన్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ, వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. నిందితులు ప్రేమ్ కుమార్, గగనం నరేంద్ర, వట్రం రవి శంకర్, మేకల హరీశ్, రేపాక కరుణాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా ఫేక్‌ డాక్యుమెంట్లతో కబ్జాలకు పాల్పడ్డం మాత్రమే కాదు, అసలు ల్యాండ్‌ ఓనర్లను బెదిరించిన వైనాలు కూడా దర్యాప్తులో వెలుగుచూశాయి.

నిందితుల దగ్గర కోట్ల విలువ చేసే 8 ఫేక్ డాక్యుమెంట్స్‌ తోపాటు స్కానర్స్, ఐ రెటీనా మిషన్స్, ల్యాప్ టాప్స్ తోపాటు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ ముఠాపై రాచకొండ, హైదారాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలు కేసులు ఉన్నాయన్నారు బాలానగర్‌ డీసీపీ సురేష్‌ కుమార్‌. సుభాష్ నగర్ లో 200 గజాలు, జూబ్లీహిల్స్‌లో 1000గజాలు, వైజాగ్, హయత్ నగర్ సైట్లకు సైతం నిందితులు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని డీసీపీ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరిలించామని డీసీపీ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..