KTR: ఫార్ములా ఈ-రేస్ కేసులో సోమవారం మరో కీలక పరిణామం.. ఏసీబీ విచారణకు కేటీఆర్..?

ఫార్ములా ఈ-రేస్ కేసులో సోమవారం మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఏసీబీ నోటీసుల విషయంలో కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఇంతకీ ఆయన విచారణకు హాజరవుతారా.. లేదా? హాజరవకపోతే ఏసీబీ ఏం చేయబోతోంది?.. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

KTR: ఫార్ములా ఈ-రేస్ కేసులో సోమవారం మరో కీలక పరిణామం.. ఏసీబీ విచారణకు కేటీఆర్..?
Formula E Race Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 05, 2025 | 9:15 PM

ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారుల విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్‌కు రెండు రోజుల క్రితం ఎసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకి కేటీఆర్ వస్తారా లేక సమయం కోరుతారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన విచారణకు రాకుంటే.. విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విచారానికి హాజరవుతారనే వినికిడి ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైతే ఫార్ములా ఈ రేసులో అసలేం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన సమాధానాల ఆధారంగానే ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు.

ఈ కేసులో క్వాష్ పిటిషన్‌పై తుది తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌పై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైనా అరెస్టు చేసే పరిస్థితులు ఉండవని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఏడో తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసులు

ఇక ఆరో తేదీన ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత.. ఆ మరుసటిరోజే, అంటే ఏడో తేదీన ఈడీ అధికారుల ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఈ రెండు దర్యాప్తు సంస్థల ముందు ఆయన హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఏసీబీ ఎదుట హాజరై ఈడీ ముందు హాజరయ్యేందుకు కేటీఆర్ సమయం కోరే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోది. మరోవైపు ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ లీగల్ టీంతో కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు సమాచారం.

ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్, B.L.N రెడ్డిలకు రెండు దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేశాయి. అయితే ఈడీ అధికారుల ముందు హాజరయ్యేందుకు ఇద్దరు కూడా సమయం కోరారు. దీంతో ఈనెల 8, 9 తేదీల్లో తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ నోటీసులు పంపింది. వాళ్ల విచారణ కంటే ముందే కేటీఆర్‌ను అధికారులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.