Chikoti Praveen: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న చికోటి ప్రవీణ్.. ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు
చికోటి ప్రవీణ్ తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేసినో కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం సాగింది. బీజేపీలోకి త్వరలోనే జాయిన్ అవుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల తన పొలిటికల్ ఎంట్రీ పై చికోటి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యాల ద్వారా బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం అన్నట్టుగా తేలిపోయింది.

చికోటి ప్రవీణ్ తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేసినో కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం సాగింది. బీజేపీలోకి త్వరలోనే జాయిన్ అవుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల తన పొలిటికల్ ఎంట్రీ పై చికోటి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యాల ద్వారా బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం అన్నట్టుగా తేలిపోయింది. హిందుత్వం అనేది తన రక్తంలోనే ఉందని ఒకవేళ పొలిటికల్ గా వెళితే నేను బీజేపీలోనే జాయిన్ అవుతానని కామెంట్స్ చేశారు చీకోటి ప్రవీణ్ కుమార్. హిందువుగానే పుట్టా హిందువుగానే చస్తా అనే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే మరికొందరు కేవలం కేసుల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే బీజేపీలోకి జాయిన్ అవుతున్నారని సెటైర్లు కూడా వేస్తున్నారు.
ప్రస్తుతం క్యాసినో కింగ్ చికోటీ రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్దమైనట్టుగా తెలుస్తుంది. తాజాగా ఢిల్లీలో బండి సంజయ్, డీకే అరుణ అతనికి శాలువా కప్పి సత్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో చికోటి తరచు బీజేపీ నాయకులతో కలవడం జరుగుతూనే ఉంది. బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ అయినట్టుగా బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలాస్తున్నాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నంలో ఏదో ఒక స్థానం నుండి పోటీచేయాలని చికోటి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది.




అయితే ఇన్ని కేసులల్లో ఉన్న చికోటిని బీజేపీ చేర్చుకోదు అన్న వాదనలు కూడా లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా జంతువులను పెంచడం, కేసినో నిర్వహణ ఆర్ధిక లావాదేవీలు లాంటి అనేక కేసులు చీకోటిపై నడుస్తున్నాయి. చికోటిని పార్టీలోకి చేర్చుకుంటే పార్టీ లాభం కంటే నష్టమేనని కొందరు అభిప్రాయపడుతున్నారట. చిన్న వ్యాపారంగా స్టార్ట్ అయి కేసినో డాన్ గా ఎదిగిన చికోటిని బీజేపీ చేర్చుకుంటుందా లేక పునరాలోచన చేస్తుందా వేచి చూడాలి.