TPCC: ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసేది వీరే.. అందులో ఉత్తమ్ పేరు ఉండటమే ఇప్పుడు ట్రెండింగ్
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధం అవుతుంది. కర్ణాటక ఎన్నికలతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరస కమిటీలు వేస్తూ.. కాంగ్రెస్ మార్క్ పొలిటిల్ గేమ్ మొదలు పెట్టింది. ఏఐసీసీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం వేసిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జర్గుతుంది. ఎన్నికల ముందు కమిటీలు సహజమే మరి ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా ? ఆ కమిటీలో ఓ పేరు ఇప్పుడు గాంధీ భవన్‌లో పెద్ద ట్రెండింగ్ అయ్యింది. ఆ ఇంట్రస్టింగ్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

తెలంగాణ, ఆగస్టు 3: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేని జోష్.. కర్ణాటక విజయం, బీజేపీ అంతర్గత విభేదాలు.. అధ్యక్ష మార్పుతో మారిన రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా మరయనే జోష్‌లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంత జోష్‌ను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఎన్నికలకు చాలా రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ అధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు ఒక కమిటీని ప్రకటించింది. ఇందులో ముగ్గురు ఏఐసీసీ నాయకులతో పాటు రాష్ట్రానికి చెందిన రేవంత్, భట్టి, ఉత్తమ్‌లకు చోటు ఇచ్చారు. అయితే ఇదే టాపిక్‌పై ఇప్పుడు కాంగ్రెస్ లో జోరుగా చర్చ నడుస్తోంది.క మిటీ ప్రకటిస్తే దాంట్లో చర్చనీయాంశం కావడానికి ఏముందని అనుకుంటున్నారా..? ఏఐసీసీ నుండి ఉన్న ముగ్గురు సభ్యులు కాకుండా రాష్ట్రానికి చెందిన వారిలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు చోటు ఇచ్చారు.
ఇది కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే పద్ధతి కానీ ఈ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు ఇవ్వడం ఇప్పుడు చర్చ సాగుతుంది. ఉత్తమ్ పార్టీ మారుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తను ఉత్తమ్ ఖండించినప్పటికీ ప్రచారం ఆగలేదు. ఇలాంటి సమయంలో జాతీయ నాయకత్వం ఆయనను కీలక కమిటీలో సభ్యుడిగా నియమించిడం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ముఖ్యమైన అభ్యర్థుల ప్రకటించే స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించడం అనేది కాంగ్రెస్ మార్క్ రాజకీయమా లేక ఉత్తమ్ పార్టీ మారకుండా చేయడానికేనా అన్న చర్చ నడుస్తుంది.
అయితే అభ్యర్థులను ముందే ప్రకటించాలని చాలా రోజుల నుంచి మొండి పట్టు వేసుకుని కూర్చున్నారు కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి. కానీ ఆయనకు ఈ కమిటీలో చోటు దొరకలేదు. అయితే ఉత్తమ్‌కు ఇవ్వడానికి ఏమైనా బలమైన కారణం ఉందా అనే విషయం పై గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇతర ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు కూడా ఇలాంటి కమిటీలు వేసిన అందులో మాజీ పీసీసీ అధ్యక్షులకు చోటు లేదు .కేవలం తెలంగాణలో మాత్రమే మాజీ పీసీసీ అధ్యక్షుడు అయిన ఉత్తమ్‌కు చోటు లభించడం విశేషం.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..