AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో 1000 అడవి పందులు.. అందుకు ఓకే చెప్పిన అటవీ శాఖ..

ఫారెస్ట్ ఏరియా కావటంతో ఇక్కడ ప్రతిసారి అడవి పందుల బెడద అధికారులను వెంటాడుతూనే ఉంది.. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో క్యాడేట్స్ ట్రైనింగ్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ట్రైనింగ్ సందర్భంగా ప్రతిరోజు కూడా జెట్ ప్లేన్ లు రన్ వే తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో అకాడమీలోకి అడవి పందులు ఎక్కువగా సంచరిస్తుండటం అంత శ్రేయస్కరం కాదు అంటున్నారు అధికారులు. అడవి పందుల వల్ల శిక్షణ తీసుకుంటున్న ట్రైనీలతో పాటు, రన్ వే పై తిరిగే జట్ ప్లేన్..

Hyderabad: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో 1000 అడవి పందులు.. అందుకు ఓకే చెప్పిన అటవీ శాఖ..
Wild Boars
Vijay Saatha
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 25, 2023 | 7:34 AM

Share

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అడవి పందుల బెడద అధికారులకు కలవరం కలిగిస్తుంది.. దుండిగల్ లో 1500 ఎకరాల్లో ఉన్న దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ చుట్టూ అటవీ ప్రాంతం ఉంది.. చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియా కావటంతో ఇక్కడ ప్రతిసారి అడవి పందుల బెడద అధికారులను వెంటాడుతూనే ఉంది.. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో క్యాడేట్స్ ట్రైనింగ్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ట్రైనింగ్ సందర్భంగా ప్రతిరోజు కూడా జెట్ ప్లేన్ లు రన్ వే తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో అకాడమీలోకి అడవి పందులు ఎక్కువగా సంచరిస్తుండటం అంత శ్రేయస్కరం కాదు అంటున్నారు అధికారులు. అడవి పందుల వల్ల శిక్షణ తీసుకుంటున్న ట్రైనీలతో పాటు, రన్ వే పై తిరిగే జట్ ప్లేన్ లకు సైతం ప్రమాదం వాటిల్లుతుందని అధికారులు వాపోతున్నారు.. దీంతో వేరే ఆప్షన్ లేక అటవీశాఖ అధికారులకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారులు లేఖ రాశారు. అటవీపందులను చంపేందుకు షార్ప్ షూటర్ కావాలంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి విన్నవించుకున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ లేఖ పై అటవీశాఖ అధికారులు స్పందించారు. డాక్టర్ రామ్ సంజయ్ అనే షార్ప్ షూటర్ కు అడవి పందులను చంపుట టాస్క్ ను అప్పగిస్తూ ఫారెస్ట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారులకు రిప్లై పంపారు అటవీ శాఖ అధికారులు.

గతంలో 50 అడవి పందులను చంపిన షూటర్..

అయితే ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అడవి పందులు సంచారం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇదే తరహాలో అకాడమీ పరిసరాల్లో అడవిపందులు సంచరిస్తుండటంతో అటవీ అధికారులను ఆశ్రయించారు అకాడమీ ఆఫీసర్స్. 2018 లోనూ ఇదే తరహాలో అటవీపందుల సంసారం ఎక్కువగా ఉండటంతో అటవీశాఖ అధికారులు నవాబ్ అలీ ఖాన్ అనే సార్ షూటర్ ను 2018లో సుమారు 50 అడవి పందులను అతడు సంహరించాడు.గడిచిన మూడు నెలల వ్యవధిలో 16 అడవి పందులను చంపారు షార్ప్ షూటర్ లు. మొత్తం 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ చుట్టూ ఫారెస్ట్ ఏరియా ఉండటంతో అడవి పందుల బెడద ఇటీవల మరి ఎక్కువైంది. అయితే ఈ సమస్య కేవలం ఎయిర్ఫోర్స్ అకాడమీ తోనే కాకుండా హైదరాబాదులోని మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో అడవిపందుల సంచారం ఎక్కువగా ఉంది.icrisat, rgia తో పాటు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంతాల్లోనూ అడవి పందుల బెడద ఉంటుంది… అక్కడ కూడా షార్ప్ షూటర్ల ద్వారా అడవి పందులను చంపే ప్రయత్నం కొనసాగుతుంది.

అడవి పందులను చంపటం సరైన నిర్ణయమే..

ప్రతిష్టాత్మక సంస్థలలో అడవి పందుల బెడద కలచి వేస్తున్న తరుణంలో వాటిని చంపటం సరైన నిర్ణయం అని తెలంగాణ వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్ కూడా అభిప్రాయపడుతున్నారు. అడవి పందుల జాతి విస్తరిస్తే ముప్పు తప్పదని అభిప్రాయపడుతున్నారు. అయితే వాటిని సంహరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైల్డ్ లైఫ్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. వాటిని చంపిన తర్వాత విచ్చలవిడిగా బుల్లెట్లను పడవేయొద్దని అకాడమీ అధికారులకు వైల్డ్ లైఫ్ తరుపున సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..