AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గర్భవతి అయిన భార్యని వదిలి లేడీ కానిస్టేబుల్‌తో ఎఫైర్ పెట్టుకున్న పోలీస్ .. భార్య న్యాయ పోరాటం

సైబరాబాద్ పరిధిలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీశైలంకు 2021లో మిట్టకోడూరుకు చెందిన నర్సింహులు కుమార్తెతో వివాహమైంది. భార్య గర్భవతి అవ్వగానే ఎఆర్ కానిస్టేబుల్ శ్రీశైలం మోహం చాటేశాడు.

Telangana: గర్భవతి అయిన భార్యని వదిలి లేడీ కానిస్టేబుల్‌తో ఎఫైర్ పెట్టుకున్న పోలీస్ .. భార్య న్యాయ పోరాటం
Constable Wife Protest
Surya Kala
|

Updated on: Mar 21, 2023 | 12:49 PM

Share

రోజు రోజుకీ సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు అధికమవుతున్నాయి. వయసుతో, వరసలో పనిలేదు.. సమాజంలో పది మందికి ఆదర్శంగా అండగా నిలబడవల్సిన వారు కూడా వివాహేతర సంబంధాలను నెరపుతున్న సంఘటలు అనేకం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తన భర్త మరో లేడీ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, న్యాయం చేయాలంటూ అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది భార్య. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని పరిగి మండలం తొండపల్లిలో ధర్నా చేపట్టిన బాధితురాలికి సమీప బంధువులు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీశైలంకు 2021లో మిట్టకోడూరుకు చెందిన నర్సింహులు కుమార్తెతో వివాహమైంది. భార్య గర్భవతి అవ్వగానే ఎఆర్ కానిస్టేబుల్ శ్రీశైలం మోహం చాటేశాడు. బంధువులంతా పంచాయితీ పెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఏమైనా చేసుకోండంటూ సమాధానం ఇచ్చాడు. చేసేదేమి లేక భర్త ఇంటి ముందు బంధువులతో బైటాయించింది మహిళ. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తూ.. తనను ఇలా నడిరోడ్డుపై పడేయడంపై మండిపడుతోంది. తనకు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఇప్పుడు రక్షణ ఎవరంటూ ప్రశ్నిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..