Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఆర్ఎస్ కార్యక్రమాలకు మాజీ మంత్రి దూరం.. మౌనం వెనుక ఆంతర్యమేంటి..!

మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్నెల్యే గంగుల కమలాకర్ ఎప్పుడూ దూకుడుగా ఉంటారు. స్వపక్షం అయినా, విపక్షం అయినా హడావిడి చేస్తుంటారు. కానీ బీఅర్ఎస్ అధికారం దిగిపొయాక గంగుల సైలెంట్ అయ్యారు. బీఅర్ఎస్ ఇచ్చిన ‌నిరసన కార్యక్రమాలలో కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీ అధికారిక కార్యక్రమంలో‌ పాల్గోన్నా అంత దూకుడుగా కనిపించడం లేదు. మరి గంగుల కమలాకర్ మనసులో‌ ఏముంది. అయన‌ ఎలాంటి స్ఠెప్పుతో ముందుకు వెళ్తారనే చర్చ జోరుగా సాగుతుంది.

బీఆర్ఎస్ కార్యక్రమాలకు మాజీ మంత్రి దూరం.. మౌనం వెనుక ఆంతర్యమేంటి..!
BRS Party
G Sampath Kumar
| Edited By: Srikar T|

Updated on: Jul 04, 2024 | 11:42 AM

Share

మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్నెల్యే గంగుల కమలాకర్ ఎప్పుడూ దూకుడుగా ఉంటారు. స్వపక్షం అయినా, విపక్షం అయినా హడావిడి చేస్తుంటారు. కానీ బీఅర్ఎస్ అధికారం దిగిపొయాక గంగుల సైలెంట్ అయ్యారు. బీఅర్ఎస్ ఇచ్చిన ‌నిరసన కార్యక్రమాలలో కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీ అధికారిక కార్యక్రమంలో‌ పాల్గోన్నా అంత దూకుడుగా కనిపించడం లేదు. మరి గంగుల కమలాకర్ మనసులో‌ ఏముంది. అయన‌ ఎలాంటి స్ఠెప్పుతో ముందుకు వెళ్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బలమైన నేత, బీసీ వర్గాల్లో మంచి పట్టున్న నేత, ఇప్పటి వరకూ ఓటమి చెందకుండా వరుసగావిజయం సాధిస్తున్నారు. అంతే కాకుండా బీఅర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ‌కేటీఅర్‎కు అత్యంత సన్నిహితుడు. ఈ పదేళ్ళలలో ప్రభుత్వంలో, పార్టీలో అన్నీ తానై నడిపించారు. 2009లో‌ టిడిపి విజయం సాధించిన తరువాత 2014 ఎన్నికల కంటే ముందు బీఅర్ఎస్‎లో చేరారు. 2014, 2018, 2023‎లో మొత్తం నాలుగుసార్లు కరీంనగర్ నుండి విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో బీఅర్ఎస్ ఓడిన తరువాత కమలాకర్ సైలెంట్ అయ్యారు. పూర్తిగా హడవుడి‌ తగ్గించారు.

పార్లమెంటు ‌ఎన్నికల్లో కుడా అంత దూకుడు‌ ప్రదర్శించలేదు. నియోజకవర్గంలోని చేపట్టిన ఏ కార్యక్రమాల్లో పాల్గోనడం లేదు. ఒకవేళ కరీంనగగర్‎లో‌ ఉన్నప్పటికీ ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎప్పుడూ ‌మీడియాలో యాక్టివ్‎గా కనబడే కమలాకర్ ఇప్పుడు ‌మీడియాకి‌ దూరంగా ఉంటున్నారు. బిఅర్ఎస్‎లో‌ ఉన్నప్పటికీ పార్టీ నేతలతో చురుగ్గా‌ కలిసి చర్చించడం లేదు. ఈ విషయాన్ని కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. అయితే కమలాకర్ మనసులో‌ ఎముందో ఎవరికి అర్థం కావటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి.. కమలాకర్ గతంలో‌ టిడిపిలో‌ కలిసి పనిచేశారు. వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. ప్రభుత్వం ‌పైన‌ కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు ఎమ్మెల్యే కమలాకర్. ఎప్పుడూ దూకుడుగా ఉండే కమలాకర్ ఇప్పుడు ‌మౌనానికి‌ అధిక ప్రాధాన్యత ‌ఇస్తున్నారు. పార్టీ మార్పు పైనా ఇప్పటికే తన అనుచరులకి సంకేతాలు ఇచ్చారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను‌ పార్టీలోనే ఉంటానని, బిఅర్ఎస్‎ను వీడే ప్రసక్తే లేదని‌ స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‌ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని కొందరు బీఅర్ఎస్ ‌కార్పోరేటర్లు ముఖ్య నేతలు కాంగ్రెస్ ‌కండువా కప్పుకున్నారు. జిల్లాలో వివిధ సమస్యలపైన బీఅర్ఎస్ ఘాటుగా‌ విమర్శలు చేస్తుంటే.. మాజీ మంత్రి మాత్రం సైలెంట్ ‌అయిపోయారు. దీంతో ఆయన మనసులో ఏముందో అన్న అభిప్రాయాన్ని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..