ట్రాఫిక్‌ ఎస్ఐ జీపునే ఎత్తుకెళ్లిన ఘనుడు, అర్థరాత్రి వరకు వెతుకులాడి జీపును దొరకబుచ్చుకున్న పోలీసులు

మన వెహికిల్‌ను ఎవడైనా ఎత్తుకెళితే పోలీసులకు కంప్లయింట్‌ చేస్తాం. అదే పోలీసుల వెహికిలే ఎవరైనా ఎత్తుకెళితే .. పాపం వారు ఎవరికి ఫిర్యాదు చేస్తారు?

ట్రాఫిక్‌ ఎస్ఐ జీపునే ఎత్తుకెళ్లిన ఘనుడు, అర్థరాత్రి వరకు వెతుకులాడి జీపును దొరకబుచ్చుకున్న పోలీసులు
Follow us
Balu

|

Updated on: Dec 14, 2020 | 11:21 AM

మన వెహికిల్‌ను ఎవడైనా ఎత్తుకెళితే పోలీసులకు కంప్లయింట్‌ చేస్తాం. అదే పోలీసుల వెహికిలే ఎవరైనా ఎత్తుకెళితే .. పాపం వారు ఎవరికి ఫిర్యాదు చేస్తారు? ఎవరితో మొరపెట్టుకుంటారు? వరంగల్ కాజీపేటలో ఓ ఆకతాయి ఇదే పని చేశాడు. పోలీసులు విధుల్లో ఉన్నప్పుడే జీపును ఎత్తుకెళ్లాడు.. పోలీసులను పరుగులు పెట్టించాడు. సమ్మయ్య అనే ట్రాఫిక్‌ ఎస్ఐ డ్యూటీలో భాగంగా కాజీపేట చౌరస్తాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ సోదాలు చేపట్టారు. తాళాలు జీపుకే ఉండటాన్ని గమనించిన సమ్మయ్య పోలీసుల కళ్లు గప్పి ఎంచక్కా ఆ వాహనాన్ని తీసుకెళ్లాడు. విధి నిర్వహణలో ఉన్న ఆ ట్రాఫిక్‌ ఎస్‌ఐ జీపు పోయిందన్న సంగతిని ఆలస్యంగా గుర్తించారు.. సహచరులతో కలిసి రాత్రంతా జీపు కోసం వెతికారు. అదృష్టం కొద్దీ ఎస్‌ఐ మొబైల్‌ ఫోన్‌ జీపులోనే ఉంది కాబట్టి సరిపోయింది.. లేకపోతే సిగ్నల్స్‌ ఆధారంగా జీపెక్కడ ఉందో గుర్తించడం కష్టమయ్యేది. కాజీపేట్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో హసన్‌పర్తి మండలం కొమిటిపల్లి తండా సమీపంలో జీపును పట్టుకున్నారు. SI టోపీతో పాటు, ఇతర వస్తువులన్నీ అందులో భద్రంగానే ఉన్నాయి.. మరి సమ్మయ్య జీపునెందుకు ఎత్తికెళ్లినట్టు అంటే.. ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదట!