Weather Report: ఉపరితల ద్రోణి ప్రభావం.. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు..
Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు
Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలో మళ్లీ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. దీంతోపాటు పిడుగులు పడటంతో పలువురు మరణించారు. అయితే తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కేరళ నుంచి కర్ణాటక, మరాఠ్వాడ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో, దక్షిణ తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
బుధవారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి వర్షం కురిసే అవకాశం కూడా ఉందని వివరించారు. మరో ఐదు రోజులపాటు వాతావరణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి శనివారం వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కురిసిన అకాల వర్షం నష్టాన్ని మిగిల్చింది. పిడుగు పాటు ఘటనలకు రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు వరకూ మృత్యువాత పడ్డారు. పలుచోటల్ మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. ధాన్యం, మిర్చి తడిసి ముద్దయింది.
Also Read: