బీసీ రిజర్వేషన్లను ఎలా నిర్ణయించారు.. వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
BC Reservations: వెనుక బడిన కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్రమైన అధ్యయనం చేసిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను...
BC Reservations: వెనుక బడిన కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్రమైన అధ్యయనం చేసిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2018, 2019లో దాఖలైన పిటిషన్లపై ఇప్పటికీ కౌంటర్ వేయకపోవడం ఏమిటని తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. బీసీ కమిషన్ నివేదికతో పాటు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌లను 34శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని సవాల్ చేస్తూ న్యాఆయవాది సామల రవీందర్‌రెడ్డితో పాటు మరి కొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం మళ్లీ విచారించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ తరపున న్యాయవది ధర్మేశ్ డీకే జైశ్వాల్ వాదనలు వినిపించారు. తెలంగాణ బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌లు నిర్ణయించారని, ఇది చట్టవిరుద్దమని తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు పిటిషనర్ న్యాయవాది డికె జైస్వాల్ తెలిపారు. 2014 లో తెలంగాణ ప్రభుత్వం సమగ్రా కుతుంబ సర్వే నిర్వహించి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని అన్ని వర్గాల వివరాలను సేకరించింది. రాష్ట్ర జనాభాలో బీసీలు 61% ఉన్నారని సర్వే సూచించినప్పటికీ, ప్రభుత్వం అధికారికంగా సర్వేలోని ఫలితాలను లేదా విషయాలను విడుదల చేయలేదని ఆయన అన్నారు. కాగా, బీసీలకు సంక్షేమ పథకాలను కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా అమలు చేస్తామని, అయితే తాము బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించామని అదనపు న్యాయవాది జనరల్ రామచందర్‌రావు కోర్టుకు నివేదించారు. బీసీ కమిషన్ నివేదికను సమర్పించారా..? అని ధర్మాసనం ప్రశ్నించగా, లేదని ఏఏజీ చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం బీసీ కమిషన్ నివేదికతో పాటు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లను నిర్ణయించారో స్పష్టం చేస్తూ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అదనపు అఫిడవిట్‌తో పాటు నివేదికను దాఖలు చేయడానికి 10 రోజుల సమయాన్ని కోరింది ప్రభుత్వం. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: వరంగల్‌లో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన… రూ.2500 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పనుల శ్రీకారం