వరంగల్‌లో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన… రూ.2500 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పనుల శ్రీకారం
గ్రేటర్ వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు.. రూ. 2,500వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు.
Minister Ktr In Warangal Tour
Follow us
గ్రేటర్ వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు.. రూ. 2,500వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ చేరుకున్న మంత్రి కేటీఆర్.. మొదట రాంపూర్‌లో ఏర్పాటుచేసిన మిషన్‌భగీరథ వాటర్ ట్యాంకును ఓపెన్ చేశారు. మంచినీటి కోసం మొత్తం 1,580 కోట్లను ఖర్చు పెట్టారు.
అంతేకాదు.. 35 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రకాళీ బండ్, ఆహ్లాదం పంచే పార్కులు, వివిధ జంక్షన్లను మంత్రి ప్రారంభించారు.
వరంగల్ నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
వరంగల్‌లో నిర్మించిన సమలీకృత మార్కెట్‌ను మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.
వరంగల్ పద్మాక్షి ఆలయం వద్ద నిర్మించిన “సరిగమప పార్కు”ను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
వరంగల్ నగరంలో రూ.21.5 కోట్లతో చేపట్టిన వడ్డేపల్లి చెరువు కట్ట సుందరీకరణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సమ్మయ్య నగర్ వద్ద రూ. 22 కోట్లతో చేపట్టే నాలా పై నిర్మించే వాల్, రూ.54 కోట్లతో చేపట్టే వరద నీటి డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్.
తెలంగాణలోనే తొలిసారి జర్నలిస్టుల కోసం నిర్మిస్తున్న ప్రెస్ కాలనీకి మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు.