Weather Report: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న వాన ముప్పు.. బంగాళఖాతంలో మరో అల్పపీడనం..!
తెలుగు రాష్ట్రాలకు మరో వానగండం పొంచి ఉంది. బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు మరో వానగండం పొంచి ఉంది. బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అనంతరం 24 గంటల్లో ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, ఉపరితల ఆవర్తనం తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో అటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అధికారులను అందుబాటులో ఉండాలని సూచించారు.