AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌ అమీర్‌పేటలో మేగా జాబ్‌ మేళా.. 2500కిపైగా ఉద్యోగాలు.

Job Mela: మీరు డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నారా.? రకరకాల కోర్సులు చేసి ఒక్క చాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా.? మీలాంటి వారి కోసమే హైదరాబాద్‌ వెస్ట్ జోన్‌ పోలీసులు మంచి అవకాశాన్ని..

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌ అమీర్‌పేటలో మేగా జాబ్‌ మేళా.. 2500కిపైగా ఉద్యోగాలు.
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 24, 2021 | 6:40 AM

Share

Job Mela: మీరు డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నారా.? రకరకాల కోర్సులు చేసి ఒక్క చాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా.? మీలాంటి వారి కోసమే హైదరాబాద్‌ వెస్ట్ జోన్‌ పోలీసులు మంచి అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబర్‌ 25 శనివారం రోజున భారీ జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న జాబ్‌ మేళా కాబట్టి ఎలాంటి సంశయం లేకుండా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ జాబ్‌ మేళా సెప్టెంబర్‌ 25 (శనివారం)న ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇక జాబ్‌ మేళాను అమీర్ మెయిన్ రోడ్‌లో ఉన్న కమ్మ సంఘంలో (చందన బ్రదర్స్‌ వెనకాల) నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు bit.ly/jcepass వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీ విద్యార్హతలతో పాటు ఇతర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఇక భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ జాబ్‌ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. అలాగే ఏకంగా 2500కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. మరి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

పోలీసుల ట్వీట్..

Also Read: IRCTC Shri Ramayan Yatra: రామ భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీ రామాయణ యాత్ర ఎక్స్ ప్రెస్ పర్యాటకను మరిన్ని రైళ్లు..

Mars Quakes: అంగారకుడిపై కూడా ప్రకంపనలు.. ఒక నెలలోనే మూడు సార్లు వణికిన అరుణ గ్రహం

Gangrape: అమానుషం.. అంతకుమించిన ఘోరం.. మహారాష్ట్రలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై 29 మంది గ్యాంగ్‌రేప్‌..