AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangrape: అమానుషం.. అంతకుమించిన ఘోరం.. మహారాష్ట్రలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై 29 మంది గ్యాంగ్‌రేప్‌..

చట్టాలెన్ని వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేదు. బాలిక అన్న కనికరం లేదు.. ఒల్లు మరిచి అత్యాచారానికి బరితెగిస్తున్నారు మానవ మృగాళ్లు. అమానుషం.. అంతకుమించిన ఘోరం..

Gangrape: అమానుషం.. అంతకుమించిన ఘోరం.. మహారాష్ట్రలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై 29 మంది గ్యాంగ్‌రేప్‌..
Gangraped
Sanjay Kasula
|

Updated on: Sep 23, 2021 | 9:49 PM

Share

చట్టాలెన్ని వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేదు. బాలిక అన్న కనికరం లేదు.. ఒల్లు మరిచి అత్యాచారానికి బరితెగిస్తున్నారు మానవ మృగాళ్లు. అమానుషం.. అంతకుమించిన ఘోరం.. ఇటీవల ముంబయిలో నిర్భయ తరహా ఘటనను ఇంకా మరిచిపోకముందే.. మహారాష్ట్ర థానేలో జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఏకంగా 29 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అత్యాచారాన్ని వీడియో తీశారు కామాంధులు. ఈ ఘటన థానే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది నిందితుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

14 ఏళ్ల బాలికపై 29 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాలిక అసభ్యకర వీడియోలు తీసిన యువకులు.. అవే వీడియోల్ని అడ్డం పెట్టుకొని అత్యాచారానికి ఒడిగట్టారు. 8 నెలలుగా సాగుతోంది ఈ అఘాయిత్యం. ఈ ఘటనలో ఇప్పటివరకు 26 మంది నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఈ ఏడాది సెప్టెంబరు వరకు 29 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ బాలిక బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి: Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..

Stock market update: బుల్‌ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..

రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..