Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..

గబ్బిలాలకు కరోనా వైరస్‌ వస్తుందా? వాటి ద్వారా మనుషులకు వైరస్‌ సోకుతుందా? ఇదే ఇప్పటికీ అందరినీ టెన్షన్‌ పెడుతోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే...

Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..
Scientists Find Bats
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 23, 2021 | 6:16 PM

గబ్బిలాలకు కరోనా వైరస్‌ వస్తుందా? వాటి ద్వారా మనుషులకు వైరస్‌ సోకుతుందా? ఇదే ఇప్పటికీ అందరినీ టెన్షన్‌ పెడుతోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే మరో సంచనల విషయాన్ని బయట పెట్టారు పరిశోధకులు. గబ్బిలాల్లో కరోనా వంటి మరో వైరస్ ఉందంటున్నారు. కొవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో.. మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ పుట్టుకపై అన్వేషణ సాగుతున్న దశలోనే గబ్బిలాల్లో మరో కొత్తరకం కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ సార్స్‌కోవ్‌-2ను పోలి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ఫ్రాన్స్‌లోని పాశ్చర్ ఇనిస్టిట్యూట్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లావోస్ పరిశోధకులు వెల్లడించారు. గబ్బిలాల్లో కొత్త రకపు కరోనా వైరస్‌ను వీరు తమ అధ్యయనంలో గుర్తించారు. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19 వైరస్‌ను జన్యుపరంగా పోలి ఉన్నట్లు వెల్లడించారు. కొవిడ్ -19 వైరస్‌కు అతిదగ్గరగా ఉన్న రెండో వైరస్‌గా పేర్కొన్నారు.

గబ్బిలాల్లో ఎన్నిరకాల కరోనా వైరస్‌లు ఉన్నాయి.. వాటిలో ఎన్నింటికి మనుషులకు విస్తరించే సామర్థ్యం ఉంది.. అనే అంశంపై వీరు అధ్యయనం జరిపారు. చిన్న గబ్బిలాలు, గుహల్లో ఉండే గబ్బిళాల నుంచి నమూనాలను సేకరించి పరిశీలించారు. గబ్బిలాల మూత్రం, మలంతోపాటు అవి నివసించే ప్రాంతాల్లో నుంచి నమూనాలను సేకరించి పరిశోధనలు జరిపారు.

వారి అధ్యయనంలో SARS-CoV-2 వైరస్‌ జన్యుపరంగా దగ్గరగా ఉండే వైరస్‌లు ఆ గబ్బిళాల్లో గుర్తించారు. వీటిని ఉత్తర లావోస్‌లోని సున్నపురాయి గుహలలో వీటిని గుర్తించారు. సేకరించిన నమూనాలను విశ్లేషించిన ఎలోయిట్ వైరస్‌లు, SARS-CoV-2 మధ్య ఇంకా ముఖ్యమైన తేడాలు ఉన్నాయని వారు వెల్లడించారు.

వైరస్ మూలాన్ని గుర్తించడంలో వీరి పరిశోధనతో ఓ ముందడుగు పడిందని అభిప్రాయ పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన కరోనావైరస్ సజీవ గబ్బిలాలతో ప్రారంభమై ఉండవచ్చనే సిద్ధాంతాన్ని వీరు కొద్దివరకు ధృవీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఎంత ఆపినా ఆగలేదు.. కట్టలు తెంచుకున్న దుఖం.. తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు.. ఈ నాయకుడి బాధేంటో తెలిస్తే..

LIC IPO: డ్రాగన్‌ కంట్రీకి మోడీ సర్కార్ మరో ఝలక్‌.. ఇక ముందు భారత్‌లోకి అలా నో ఎంట్రీ..