- Telugu News Photo Gallery Technology photos Redmi Launches Two New Smart TVs Have A Look On Features And Price Details
Redmi New Smart TV: రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన రెడ్‌మీ.. రూ. 15,999కే అదిరిపోయే ఫీచర్లు..
Redmi New Smart TV: చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. దీపావళి నుంచి అందుబాటులోకి రానున్న ఈ టీవీల ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Sep 23, 2021 | 6:39 AM

రూ. లక్షల్లో ఉన్న స్మార్ట్ టీవీల ధరను వేలల్లోకి తీసుకొచ్చిన ఘనత చైనాకు చెందిన రెడ్‌మీదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ ధరలో స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోందీ సంస్థ.

ఈ క్రమంలో రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లో 32 అంగుళాలు, 43 అంగుళాల సైజుల్లో రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఈ టీవీల్లో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 20 వాటా స్పీకర్స్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లను అందించారు.

ధర విషయానికొస్తే.. 32-అంగుళాల వేరియంట్ ధర రూ .15,999 కాగా, 43-అంగుళాల వేరియంట్ ధర రూ .25,999గా నిర్ణయించారు.

అయితే ఈ టీవీల అమ్మకం దీపావళి పండుగ సందర్భంగా ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌టీవీలు ఎమ్‌ఐ. కామ్, అమెజాన్ సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. సేల్‌లో భాగంగా రెడ్‌మీ స్మార్ట్‌టీవీలపై అదనపు తగ్గింపుతో ప్రత్యేక ధరలకు అందించనుంది.

ఈ టీవీల్లో హెచ్‌డీ డిస్‌ప్లే, హెచ్‌డీఎమ్‌ఐ సపోర్ట్, ఈథర్‌నెట్ సపోర్ట్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఆటో లో లేటెన్సీ మోడ్ వంటి అధునాత ఫీచర్లు మరో ప్రత్యేకత.





























