Stock market update: బుల్‌ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..

బుల్‌ రంకెలేసింది. రికార్డుల మోత మోగించింది. అటు సెన్సెక్స్‌.. ఇటు నిఫ్టీ పోటీ పడి దూసుకెళ్లాయి. మార్కెట్ల దూకుడుతో ఇన్వెస్టర్ల లాభాల పంట పడింది. మార్కెట్లు జోరుమీదున్నాయి.

Stock market update: బుల్‌ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..
Bull Run
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 23, 2021 | 5:16 PM

బుల్‌ రంకెలేసింది. రికార్డుల మోత మోగించింది. అటు సెన్సెక్స్‌.. ఇటు నిఫ్టీ పోటీ పడి దూసుకెళ్లాయి. మార్కెట్ల దూకుడుతో ఇన్వెస్టర్ల లాభాల పంట పడింది. మార్కెట్లు జోరుమీదున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి రికార్డు బ్రేక్‌ చేశాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు మారకపోవచ్చన్న అంచనాలు, చైనా స్థిరాస్తి దిగ్గజం వివరణ మార్కెట్ల దూకుడుకు కారణమైంది. సెన్సెక్స్‌ దాదాపు వెయ్యి పాయింట్ల లాభంతో 60 వేల మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది. నిఫ్టీ 17,800 పైన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 59,275 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన పరుగు చివరి వరకు అలానే కొనసాగింది. ఒక దశలో వెయ్యికి పైగా పాయింట్లు ఎగబాకిన సూచీ చివరికి 958.03 పాయింట్ల లాభంతో 59,885.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 276.30 పాయింట్లు లాభపడి 17,823 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా ప్రధానంగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఆసియాలో షాంఘై, హాంకాంగ్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు సైతం సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

రియల్టీ స్టాక్స్ రచ్చ ..

ఇవాళ నిఫ్టీ బ్యాంక్ 2.24 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.28 శాతం, రియల్టీ ఇండెక్స్ 8.66 శాతం పెరిగాయి. ఇది కాకుండా మెటల్, ఐటి సూచీలు కూడా పెరిగాయి. రియల్టీ ఇండెక్స్‌లో ఒబెరాయ్ రియల్టీ 13 శాతం లాభపడగా.. గోద్రేజ్ ప్రాపర్టీ 12 శాతం లాభపడింది. DLF 9.20 శాతం పెరిగింది.

ఇవి కూడా చదవండి: ఎంత ఆపినా ఆగలేదు.. కట్టలు తెంచుకున్న దుఖం.. తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు.. ఈ నాయకుడి బాధేంటో తెలిస్తే..

LIC IPO: డ్రాగన్‌ కంట్రీకి మోడీ సర్కార్ మరో ఝలక్‌.. ఇక ముందు భారత్‌లోకి అలా నో ఎంట్రీ..