Warangal: మంచి నీళ్ల కోసం బావికి వెళ్లిన మహిళలు.. నీళ్లు చేదుదామని బావిలోకి చూడగా..!
రోజూ మాదిరిగానే మంచి నీళ్ల కోసం బావికి వచ్చారు స్థానిక మహిళలు. తీరా నీళ్లు చేదుదామని తాళ్లు బావిలోకి వదిలిన మహిళలకు అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు. భయంతో కేకలు వేసుకుంటూ..
హన్మకొండ: రోజూ మాదిరిగానే మంచి నీళ్ల కోసం బావికి వచ్చారు స్థానిక మహిళలు. తీరా నీళ్లు చేదుదామని తాళ్లు బావిలోకి వదిలిన మహిళలకు అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు. భయంతో కేకలు వేసుకుంటూ గ్రామంలోకి పరుగులు తీశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో మంగళవారం (జూన్ 6) ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ బావిలో ఏముందంటే..
శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో మంచి నీళ్ల కోసం మంగళవారం మహిళలు బావి వద్దకు వెళ్లారు. ఐతే అప్పటికే బావిలో బారీ కొండ చిలువ పొరపాటున పడిపోయింది. బయటికి రాలేక కొండ చిలువ నీళ్లలోనే ఉండిపోయింది. దీంతో నీళ్ల కోసం వచ్చిన స్థానికులు బావిలో కొండ చిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురై కేకలు వేశారు. స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి బావి వద్దకు చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు మూడున్నర మీటర్ల పొడవున్న కొండచిలువను బావి నుంచి వెలుపలకు తీశారు. అనంతరం దానిని పట్టుకుని అడవిలో వదిలేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.