Bus Accident: వామ్మో కొద్దిలో తప్పించుకున్నారు.. హన్మకొండలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం!
హన్మకొండ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. 50 మంది ప్రయాణికులతో నిజామాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్ పక్క నుంచి ముళ్లపొదల్లోకి దూసేకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడగా..తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను MGM హాస్పిటల్‌కు తరలించారు.

Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ నుంచి హన్మకొండకు వస్తున్న TG 03 T 1265 నెంబర్ గల ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు అనంతసాగర్ సమీపంలో ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. అయితే ప్రమాదం జరిగిన స్థలంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. వేగంగా దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ట్రాన్స్ఫార్మర్‌ను ఢీకొట్టకుండా ముందు ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బస్సు ఏ మాత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తాకినా ఊహించని విధంగా ప్రాణనష్టం సంభవించి ఉండేది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడగా..డ్రైవర్ మాత్రం తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు డ్రైవర్‌తో పాటు గాయపడిన వారిని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
వీడియో చూడండి…
మరోవైపు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బస్సును అక్కడి నుంచి తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




