Cock Fights: వరంగల్ జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తున్న ఐదుగురు అరెస్టు.. నగదు, బైక్‌లు స్వాధీనం
Cock Fights: సంక్రాంతి వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. ఏపీతో పాటు తెలంగాణలోనూ కోడి పందాలు కొనసాగుతుంటాయి. తాజాగా వరంగల్ జిల్లాలో...

Cock Fights: సంక్రాంతి వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. ఏపీతో పాటు తెలంగాణలోనూ కోడి పందాలు కొనసాగుతుంటాయి. తాజాగా వరంగల్ జిల్లాలో కోడిపందాలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కోడి పందాల ఘటన హసన్‌పర్తి పరిధిలోని జయగిరి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. పందాలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్‌లు బి. నందిరామ్, మధు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. పందాలు నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు పందెం కోళ్లతో పాటు రూ.3,260 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన నిందితులు దేవరకొండ రాములు, దేవరకొండ భిక్షపతి, యాకూబ్ పాషా, ఓని సుధాకర్, సయ్యద్ మౌలాలీలుగా గుర్తించారు.