బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్‌రావు సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మహారాష్ట్ర మాజీ గవర్నర్,బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని అనంతగిరిలో శ్రీఅనంతపద్మనాభ స్వామిని విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమైందని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించింది బీజేపీయే అన్నారు.
బీజేప కార్యకర్తలు నిబద్దతతో పనిచేస్తారన్న విద్యాసాగర్ రావు.. చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా కప్పాలనేది ప్రతీ పార్టీ కార్యకర్త కోరిక అన్నారు. అందుకే తాను తిరిగి పార్టీలో సభ్యత్వం తీసుకున్నానన్నారు. బీజేపీకి రెండు సీట్లు ఉండడం శుభపరిమాణమన్నారు. గతంలో రెండు సీట్లతోనే దేశంలో నేడు అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి రెండు స్థానాలు ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకున్నదానికంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. ఆయన కృషి ఫలితంగానే రాష్ట్రంలో అధికారంలోకీ వచ్చి తీరుతామని విద్యాసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Read Also… అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాందించాడు.. అధికారుల తనిఖీలో అడ్డంగా బుక్కయ్యాడు..